లాక్ డౌన్ ఎఫెక్ట్: మహిళను చంపేసిన జవాను

  • Published By: vamsi ,Published On : April 2, 2020 / 12:06 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్: మహిళను చంపేసిన జవాను

Updated On : April 2, 2020 / 12:06 PM IST

కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్‌లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ్చిన వలస జీవుల జాబితాలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో శైలేంద్ర అనే ఆర్మీ జవాను సహనం కోల్పోయాడు.

తన వివరాలు.. కుటుంబం వివరాలు నమోదు చేసినందుకు  వినయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి కొలకత్తా నుంచి వచ్చినట్లుగా రాసి అధికారులకు అందజేశాడు. ఈ క్రమంలోనే జవాన్ శైలేంద్ర.. వినయ్ ఇంటిపైకి వెళ్లి గొడవ చేశాడు. దీంతో వినయ్‌కి సపోర్ట్‌గా ఓ మహిళ, వినయ్ సోదరుడు దినేష్ రాగా.. 36 ఏళ్ల మహిళ సంధ్యపై కాల్పులు జరిపాడు శైలేంధ్ర.

దీనిపై కుర్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, శైలేంద్రను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. గ్రామ పంచాయతీ సూచనల మేరకు, కరోనావైరస్ వ్యాప్తి తరువాత వివిధ ప్రదేశాల నుంచి తిరిగి వచ్చిన పేర్ల జాబితాను వినయ్ సిద్ధం చేశాడని, అయితే ఆగ్రహించిన శైలేంధ్ర దారుణానికి ఒడికట్టినట్లు చెప్పారు.