Chhattisgarh: మాజీ ముఖ్యమంత్రికి స్పీకర్ పదవి.. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సాహో, విజయ్ శర్మ
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.

ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన బీజేపీ.. తాజాగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను, స్పీకర్ పేరును వెల్లడించింది. ఇందులో ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రమణ్ సింగ్ ను స్పీకర్ గా ప్రకటించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో సహా సీనియర్ నేత విజయ్ శర్మలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి.
గిరిజన నేతను సీఎం పదవికి బీజేపీ ఎంపిక చేయగా, ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఎన్నుకునేటప్పుడు ఓబీసీ ఓటు బ్యాంకును కూడా దృష్టిలో ఉంచుకుంది. అరుణ్ సావో ఓబీసీ కమ్యూనిటీకి చెందినవారు. ఇఖ విజయ్ శర్మ కబీర్‌ధామ్ జిల్లా కర్వాడ నుంచి బీజేపీ ఎమ్మెల్యే. మంత్రి మహ్మద్ అక్బర్‌పై ఆయన 39,592 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్ శర్మ ఉన్నారు. 50 ఏళ్ల విజయ్ శర్మ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఇది కూడా చదవండి: ఎవరీ ఆకాష్ ఆనంద్? 2017లో రాజకీయాల్లోకి వచ్చి కేవలం 6 ఏళ్లలో బీఎస్పీ అధ్యక్షుడిగా..
అరుణ్ సావో గురించి మాట్లాడుకుంటే, ముంగేలి జిల్లాలోని లోర్మి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి థానేశ్వర్ సాహుపై 45,891 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది ఆగస్టు నెలలోనే విష్ణు దేవ్‌సాయి స్థానంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బిలాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కేంద్ర నాయకత్వం కోరింది. విజయ్ శర్మ మాదిరిగానే 55 ఏళ్ల అరుణ్ సావో కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ నిర్ణయించింది. రమణ్ సింగ్ తన సాంప్రదాయ స్థానం అయిన రాజ్‌నంద్‌గావ్ నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఊహకందని ప్రస్థానం