Arvind Kejriwal: కుమార్తె వివాహం.. పుష్ప2 సాంగ్‌కు భార్యతో కలిసి స్టెప్పులేసిన కేజ్రీవాల్.. పంజాబ్ సీఎంసైతం.. వీడియో వైరల్

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణితో కలిసి పుష్ప2 సినిమా పాటకు డ్యాన్స్ చేశారు.

Arvind Kejriwal: కుమార్తె వివాహం.. పుష్ప2 సాంగ్‌కు భార్యతో కలిసి స్టెప్పులేసిన కేజ్రీవాల్.. పంజాబ్ సీఎంసైతం.. వీడియో వైరల్

Arvind Kejriwal

Updated On : April 19, 2025 / 11:04 AM IST

Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పుష్ప2 సినిమా పాటకు స్టెప్పులేశారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Suhas : తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు యువ హీరో.. ఏ సినిమాలో తెలుసా? ఇక్కడ వరుస సక్సెస్ లు.. అక్కడ ఏం చేస్తాడో..

ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం సంభవ్ జైన్ తో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెండ్లి వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెండ్లి వేడుకలో అరవింద్ క్రేజీవాల్ తన సతీమణి సునీతతో కలిసి డ్యాన్స్ చేశారు.

 

పుష్ప2 (హిందీ వెర్షన్) సినిమాలోని ‘సూ సేకీ’ పాటకు కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత డ్యాన్స్ చేశారు. అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఏప్రిల్ 20వ తేదీన కేజ్రీవాల్ కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది.