CM Himanta Biswa Sarma : ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి : అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం.

CM Himanta Biswa Sarma : ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి : అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

assam  cm himanta biswa sarma..vegetables  prices 

Updated On : July 15, 2023 / 5:06 PM IST

Assam  cm himanta biswa sarma..vegetables  prices  : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా టమాటాలతో పాటు దాదాపు అన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Assam cm Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వారు ఎవరు? కూరగాయలు అధిక ధరలకు విక్రయించే మియా వ్యాపారులు” అంటూ శుక్రవారం (జులై 14,2023)

‘మియా’అంటూ స్థానిక భాషలో అస్సాంలో నివసిస్తున్న బెంగాలీ మాట్లాడే ముస్లింలు. వారు బెంగాల్ నుంచి వలస వచ్చినవారుగా చెబుతుంటారు. వారిని ఉద్దేశించి సీఎం హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గౌహతిలో మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. “మియా వ్యాపారులు గౌహతిలో అస్సామీల నుండి కూరగాయలకు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ గ్రామాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. కానీ ఈ రోజు అస్సామీ వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తుంటే..వారు తమ అస్సామీ ప్రజల నుండి ఎన్నడూ ఎక్కువ వసూలు చేయరు” అంటూ సీఎం హిమంత ఉటంకించారు.

Asaduddin Owaisi : మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా,మీ కోడి గుడ్డు పెట్టకపోయినా వాటికి ముస్లింలే కారణమంటారు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ముస్లిం నేత..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడుతు సెటైర్లు వేశారు. “బహుశా అతను (సీఎం హిమంత) తన ‘వ్యక్తిగత’ వైఫల్యాలను మియా భాయ్‌పై నిందిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అంతకుముందు మాట్లాడుతూ..మియా ముస్లింలు లేకపోతే అస్సాం అసంపూర్ణంగా మిగిలిపోతుందన్నారు.

దీనిపై హిమంత స్పందిస్తూ.. నేడు కూరగాయల అమ్మకందారుల్లో అత్యధికులు, రిక్షా నడిపేవారు, బస్సు డ్రైవర్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లు మియా ముస్లింలేనన్నారు. స్థానిక అస్సామీ యువత వారితో పోటీ పడాలని పిలుపునిచ్చారు. అస్సామీ యువత ఆ ఉద్యోగాలను చేయాలన్నారు. కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని.., గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని ఆరోపించారు.

West Bengal: హత్య కేసులో జైలుకెళ్లిన ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు.. పెరోల్ మీద బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు