Covid Vaccination Drive: హిజ్రాల కోసం కొవిడ్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన అస్సాం
అస్సాం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని ముప్పై మందికి తొలి వ్యాక్సినేషన్ డోస్ వేసింది ప్రభుత్వం.

Assam Starts Special Covid Vaccination Drive For Transgenders
Covid Vaccination Drive: అస్సాం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని ముప్పై మందికి తొలి వ్యాక్సినేషన్ డోస్ వేసింది ప్రభుత్వం. యావత్ దేశంలో చేయని ఆలోచనతో ఇనాక్యులేషన్ డ్రైవ్ తో ట్రాన్స్ జెండర్ షెల్టర్ హోమ్ లో వారికి వ్యాక్సిన్ వేశారు. రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో దీనిని నిర్వహించామని అధికారులు చెప్తున్నారు.
వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత అస్సాం గవర్నమెంట్ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ స్వాతి బిధాన్ మాట్లాడుతూ.. హిజ్రాల ప్రధాన ఆధాయం యాచించడమే. వాళ్లు డబ్బులు అడిగేందుకు దగ్గరకు వెళ్తే ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది.
ఓ మార్జినలైజ్డ్ గ్రూపుగా వ్యాక్సినేషన్ ప్రోసెస్ లో వారికి సదుపాయం కల్పించాం. హెల్త్ డిపార్ట్మెంట్ ను రిక్వెస్ట్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లాజిస్టిక్స్ తో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో హెల్ప్ చేశారు. గౌహతి వరకూ మాత్రమే పరిమితమై ఉన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వ్యాక్సిన్ అందుబాటును బట్టి పొడిగిస్తామని చెప్పారు.
అస్సాం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో 20వేల మంది వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అస్సాంలో కొవిడ్-19 వచ్చిన వారు శనివారానికి 3లక్షల 24వేల 979మంది వరకూ ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి.