Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లెన్ని? అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలి.. పూర్తి వివరాలు ఇలా..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా...

Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లెన్ని? అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలి.. పూర్తి వివరాలు ఇలా..

Assembly Elections 2023

Assembly Elections 2023 : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, రాజస్థాన్ లో నవంబర్ 23న, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మాత్రం రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజక వర్గాలున్నాయి. వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, రాష్ట్రాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని..? ఎన్ని స్థానాల్లో గెలిస్తే అధికారంలోకి రావచ్చు అనే వివరాలను పరిశీలిద్దాం.

Read Also : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

రాజస్థాన్ రాష్ట్రంలో..
రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 23న ఓటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే 101 సీట్లు కావాల్సి ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 116 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో..
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రెండు విడతల్లో అంటే నవంబర్ 7, నవంబర్ 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం భూపేష్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే 46 సీట్లు కావాలి.

తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలు కావాలి.

మిజోరాం రాష్ట్రంలో ..
మిజోరాం రాష్ట్రంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 సీట్లు కావాలి.