Bengaluru : భార్య గురించి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఏమన్నారంటే?

ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని లా విద్యార్ధులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. దివంగత భార్య గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

Bengaluru : భార్య గురించి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఏమన్నారంటే?

New Delhi

Updated On : August 27, 2023 / 3:36 PM IST

Bengaluru : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బెంగళూరులోని న్యాయ విశ్వవిద్యాలయంలో (NLSIU) జరిగిన 31వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగంలో దివంగత భార్య గురించి తెచ్చిన ప్రస్తావన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Supreme Court: బీహార్‭లో కులగణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

ఇటీవల బెంగళూరులో ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’ (NLSIU)31వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విద్యార్ధులను ఉద్దేశించి అనేక అంశాలపై మాట్లాడారు. ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని విద్యార్ధులకు సూచించారు. న్యాయవాద వృత్తిలో ఉండే సవాళ్ల గురించి మాట్లాడుతూ తన దివంగత భార్య గురించి ప్రస్తావించారు. ఆమె ఓ న్యాయ సంస్థలో ఉద్యోగం కోసం వెళ్లినపుడు అక్కడ పని గంటల గురించి అడిగితే వారు సంవత్సరమంతా పనిచేయాలని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారని చెప్పారు. అంతేకాదు ఇంటిపని చేసే భర్తను వెతుక్కోమని ఆమె సలహా ఇచ్చారని చంద్రచూడ్ చెప్పారు.

ఇప్పటికీ ఆడవారికి వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా గతం కంటే పరిస్థితులు కాస్త ఆశాజనకంగా ఉన్నాయని చంద్రచూడ్ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు అవసరాలను నొక్కి చెబుతూ తన మహిళా క్లర్క్‌లు నెలసరి సమయంలో బాధపడుతున్నప్పుడు వారికి ఇంటి నుంచి పని చేయమని చెబుతానని.. వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సూచిస్తానని చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టులో మహిళల బాత్రూమ్‌లలో శానిటరీ న్యాప్ కిన్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Supreme Court : ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

మహిళల హక్కులకు సంబంధించి చంద్రచూడ్ ఎన్నో చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, వ్యభిచారంపై ఆదేశాలు, శబరిమల ఆలయంలోకి ప్రవేశం, పెళ్లికాని మహిళలను అబార్షన్ చట్టంలోకి చేర్చడం వంటి నిర్ణయాల ద్వారా మహిళల స్థితిగతుల్ని బలోపేతం చేయడానికి చంద్రచూడ్ ప్రయత్నించారు.