పెళ్లి భోజనం బాగాలేదని : చితక్కొట్టేశారు

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 06:40 AM IST
పెళ్లి భోజనం బాగాలేదని : చితక్కొట్టేశారు

జనక్ పురి : దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. మంచి రోజులు రావటంతో పెళ్లిళ్లు జోరు పెరిగింది. ఈ పెళ్లిళ్లల్లో ప్రధానంగా భోజనాల తంతు మహా ముఖ్యమైనది. అతిధులకు పెట్టే భోజనంలో ఎన్ని వెరైటీలు పెట్టామనే విషయం అతి పెద్ద విషయంగా మారిపోయింది. పెళ్లి భోజనం బాగుండకపోతే అటు మగపెళ్లి వారితో వచ్చే తంటా కాస్తా పెంటగా మారిపోతుంది. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. పెళ్లి భోజనం బాగాలేదని ఆడపెళ్లివారిపై ఇంతెత్తును ఎగిరిపడ్డారు మగపెళ్లివారు. అంతటితో ఊరుకున్నారా..అంటే లేనే లేదు. ఆడపెళ్లివారిపై చేయి చేసుకున్నారు. ఆడపెళ్లి వారు కూడా ఏమీ తక్కువ తినలేదండోయ్..వారుకూడా మగపెళ్లివారిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ భోజనాల రచ్చ రచ్చగా మారిపోయింది. 

అంతేకాదు..మగపెళ్లివారు నానా మాటలన్నారనే కోపంతో పెళ్లి భోజనాలు పెట్టిన హొటల్ వారిపై విరుచుకుపడిపోయారు ఆడ పెళ్లివారు. ఇంకేముంది..అలా అలా ప్రారంభమైన ఈ భోజనాల గలాటాతో పెళ్లి ప్రాంతమంతా ఓ కిష్కందకాండలా తయారైపోయింది.  ఈఘటన పశ్చిమ ఢిల్లీ పరిధిలోని జనక్ పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. 

పెళ్లిలో తమకు వడ్డించిన పెళ్లి విందు టేస్టీగా లేదనీ..క్వాలిటీ లేదనీ..ఆడపెళ్లివారు..పెళ్లికి వచ్చిన గెస్ట్ లు కలిసి  హోటల్ స్టాఫ్ ను చావగొట్టారు. ఆపై హోటల్ లో లక్షల విలువ చేసే ఫర్నీచర్ ను ధ్వంసం చేసి పడేశారు.దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు కొట్టకుంటున్న సీన్స్..హోటల్ స్టాఫ్ ను అందరూ కలిసి కొడుతున్న సీన్స్ ఈ వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీలోని ఓ హోటల్ లో ఈ పెళ్లి వేడుకకు 500 మందికి పైగా గెస్ట్ లు వచ్చారు. వారందరికీ విందు భోజనంతో పాటు  వడ్డించే కాంట్రాక్టును హోటల్ కే అప్పగించారు. ఈ క్రమంలోనే హొటల్  మానేజ్ మెంట్ పెట్టిన ఫుడ్ బాగాలేదనీ దాడికి పాల్పడిన్ట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లిందో లేదో గానీ ఈ వీడియో మాత్రం వైరల్ గా మారటంతో వేలాదిమంది నెటిజన్స్ చూశారు. 

 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ