Maharashtra : ఈభార్యలు మాకొద్దు బాబోయ్ అంటూ..’వట పౌర్ణమి వ్రతం’చేసిన భర్తలు

ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా ఈభార్యలు మాకొద్దని ప్రార్థిస్తూ కొంతమంది పురుషులు 'వట సావిత్రి పూర్ణిమ వ్రతం'చేశారు. ఈ పూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Maharashtra : ఈభార్యలు మాకొద్దు బాబోయ్ అంటూ..’వట పౌర్ణమి వ్రతం’చేసిన భర్తలు

Aurangabad Get Rid Of Wives Husbands Had Vat Savithri Puja

Updated On : June 14, 2022 / 11:37 AM IST

Maharashtra : సాధారణంగా భర్తల క్షేమం కోసం..వారి అభివృద్ధి కోసం ఉపవాసాలతో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు భార్యలు. భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మంగళగౌరీ వ్రతం లాంటివి చేస్తుంటారు. ఏడేడు జన్మలకు ఇటువంటి భర్త కావాలని ప్రార్థిస్తు..పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతాన్ని చేస్తారు. కానీ భర్తలు భార్యల కోసం చేసే పూజలు అనేవి మన పురాణాల్లో ప్రత్యేకంగా లేవు. కానీ మహారాష్ట్రలో కొంతమంది పురుషులు మాత్రం భార్యల కోసం ప్రత్యేకించి వ్రతం చేశారు. అది భార్యల క్షేమం గురించి కాదు..‘ఈ భార్యలకు తమకు వద్దు బాబోయ్…ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా ఈ భార్యలు మాకొద్దు బాబోయ్’అని కోరుకుంటూ ‘వట సావిత్రి పూర్ణిమ వ్రతం’ చేశారు కొంతమంది పురుషులు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పౌర్ణమి రోజున ఈ ‘వట పౌర్ణమి వ్రతం’ చేసిన భర్తలు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుని మరీ ఈ భార్యలు మాకు ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా మాకు వద్దు అంటూ ప్రార్థించారు.

పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం (13,2022) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్‌లో భార్యాబాధిత వ్యక్తి ఆశ్రమంలో భార్యాబాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి ‘వట పౌర్ణమి వ్రతం’ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ రావిచెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు. ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పూజ సందర్భంగా భార్యాబాధిత సంఘం వ్యవస్థాపకుడు..అధ్యక్షుడు అయిన భరత్ ఫులారి మాట్లాడుతూ.. కొందరు మహిళలకు రావి చెట్టును పూజించే అర్హత లేదన్నారు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. భర్తల కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా..మన పురాణాల్లో సావిత్రి తన భర్త సత్యవంతుడిని యమధర్మరాజును ఎదిరించి పోరాడి మరీ రక్షించుకుంది. ఈ కథను పురస్కరించుకుని భార్యలు పౌర్ణమి రోజున తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. అదే రోజున భార్యలకు వ్యతిరేకంగా భౌసాహెబ్ సాలుంకే, పాండురంగ్ గండులే, సోమనాథ్ మనల్, చరణ్ సింగ్ గుసింగే, భిక్కన్ చందన్, సంజయ్ భంద్, బంకర్, నట్కర్, కాంబ్లే అనే పురుషులు తమ భార్యలను వ్యతిరేకిస్తూ పౌర్ణమి రోజున ‘వట పౌర్ణమి వ్రతం’చేశారు. ఈ భార్యలకు తమకు ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా మాకు వద్దు అంటూ ప్రార్థించారు.