Auto Driver : ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఆటో డ్రైవర్

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన యువతిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఆటో డ్రైవర్.

Auto Driver : ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఆటో డ్రైవర్

Auto Driver

Updated On : September 28, 2021 / 9:01 PM IST

Auto Driver : ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి ఓ యువతి ప్రాణాలు కాపాడింది. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే గేటువద్ద ఎదురుచూస్తోంది ఓ యువతి. రైలు వస్తుండటం చూసి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలవైపు పరిగెత్తింది. అందరు ఆమె అవతలివైపుకు వెళ్తుందని అనుకున్నారు.

Read More : Thirumala : శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

కానీ వెళ్లి పట్టాలపై నిలబడటంతో వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ఆమెను రక్షించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు వచ్చింది యువతి.. గేటు వద్ద నిలబడి రైలుకోసం చూస్తుంది.

అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో చూసి రైల్వే గేటు దాటి పట్టాలపైకి వెళ్ళింది. ఆమెను గమనించిన ఆటో డ్రైవర్ పరుగుపరుగున వెళ్లి యువతిని లాక్కొచ్చాడు. అయితే ఆమె ఎంతకీ పట్టాల దగ్గరి నుంచి కదలకపోవడంతో మరోవ్యక్తితో కలిసి రైల్వే ట్రాక్ నుంచి పక్కకు తీసుకొచ్చారు.ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Read More :  Kirtankar Tajuddin Baba : కీర్తనలు పాడుతూ..ప్రాణాలు వదిలిన బాబా.. వీడియో

ఉద్యోగం రాకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది యువతి. దీంతో అక్కడ ఉన్నవారు యువతికి నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి కదలికలపై అనుమానం రావడంతో ఆటోలో ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.