Driving Licences : టెస్ట్ అక్కర్లేదు..ట్రైనింగ్ సెంటర్ల వద్దే డ్రైవింగ్ లైసెన్స్..వారు కూడా లైసెన్స్ జారీ చేయొచ్చు

ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్​ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Driving Licences : టెస్ట్ అక్కర్లేదు..ట్రైనింగ్ సెంటర్ల వద్దే డ్రైవింగ్ లైసెన్స్..వారు కూడా లైసెన్స్ జారీ చేయొచ్చు

License

Updated On : August 4, 2021 / 9:05 PM IST

Driving Licences ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్​ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ట్రైనింగ్ సెంటర్లతో పాటు వాహన తయారీ సంస్థలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, చట్టబద్ధమైన ప్రైవేట్ సంస్థలు కూడా డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లను నిర్వహించవచ్చని మరియు సంబంధిత శిక్షణ పూర్తి చేసిన వ్యక్తులకు ఈ సంస్థలు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ ఆగస్టు-2న మార్గదర్శకాలు విడుదల చేసింది.

రవాణాశాఖ గైడ్ లైన్స్ ప్రకారం..లైసెన్స్ జారీ చేయాలనుకునే సంస్థలకు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం నిర్దేశిత భూమి లేదా సౌకర్యాలు కలిగి ఉండాలి. సంస్థ ఎలాంటి వివాదాల్లో ఉండకూడదు. తాము నడిపిస్తున్న కేంద్రానికి ఆర్థిక సామర్థ్యం ఉందని నిరూపించుకోవాలి. ఇలాంటి సంస్థలు దరఖాస్తు చేసుకుంటే.. 60 రోజుల్లోగా డీటీసీ గుర్తింపు లభిస్తుంది. డీటీసీ గుర్తింపు పొందిన సంస్థలు ప్రతి ఏటా సంబంధిత ఆర్టీవో అధికారులకు నివేదిక అందించాలి. ఈ సంస్థలు సొంతంగా వెబ్​సైట్ అభివృద్ధి చేసుకోవాలి. ట్రైనింగ్ క్యాలెండర్, ట్రైనింగ్ కోర్సు స్ట్రక్చర్,ట్రైనింగ్ ఫీజు, ట్రైనింగ్ సమయం, ఎన్నిరోజులు పనిచేస్తున్నారనే విషయం, శిక్షణ ఫలితాలు,శిక్షణ ఇచ్చే వారి వివరాలు, అందుబాటులో ఉన్న సేవల వివరాలను ఆ వెబ్ సైట్ లో పొందపరచాల్సి ఉంటుంది.