Auto Rickshaw Fare : ఆటో ఛార్జీల పెంపు..కనీస ఛార్జి రూ. 30
ఆటోరిక్షాల ఛార్జీల పెంపునకు ఆర్టీఏ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత..ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే..ఆర్టీఏ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు.

Auto
Auto Rides : ఓ వైపు ఆకాశాన్నంటేలా పెట్రోల్, డీజిల్ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్‌కు తోడు… ఇప్పుడు ఆటో ఛార్జీలు పెరగడంతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయ తీసుకోవడంతో కాస్త ధరలు దిగి వచ్చాయి. ఆటోరిక్షాల ఛార్జీల పెంపునకు ఆర్టీఏ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత..ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే..ఆర్టీఏ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు.
Read More : Kajal Aggarwal: మాతృత్వం ఓ అద్భుతమైన అనుభూతి.. ప్రెగ్నెన్సీపై కాజల్
మొదటి 1.9 కిలోమీటర్లకు 2 కి.మీటర్ల వరకు రూ. 30 పెంచుతూ కర్నాటక ఆర్టీఏ నిర్ణయం తీసుకుంది. మొదట కనీస ఛార్జీని రూ. 25 గా ఉండేది. ప్రతి అదనపు కిలోమీటర్ కు రూ. 13 నుంచి రూ. 15కు పెంచుతున్నట్లు పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణించే ఆటోల్లో 50 శాతం ప్రీమియం వసూలు చేయనున్నారు. మొదటి ఐదు నిమిషాల వరకు వెయిటింగ్ ఛార్జీ ఉండదు. ఆటో రిక్షా డ్రైవర్లు ప్రతి 15 నిమిషాలకు రూ. 5 వసూలు చేస్తారని తెలుస్తోంది.
Read More : India Covid : 12 లక్షల మందికి పరీక్షలు…11 వేల కేసులు
20 కిలోల బరువున్న వస్తువులకు ఎలాంటి లగేజ్ ఛార్జీ విధించరు. ఎల్ పీజీ రేట్లు, నిర్వాహణ రేట్లు పెరగడంతో…ఆటో రిక్షాల ఛార్జీలను పెంపును పరిగణించినట్లు ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. ఆటో రిక్షా ఎల్పీజీ ధర లీటర్ కు రూ. 58.18 ఉంటే..ఈ సంవత్సరం నవంబర్ లో రూ. 66కి పెరిగింది. 2020 మే నెలలో లీటర్ రూ .32.51గా ఉంది. ఛార్జీల పెంపుపై ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియడం లేదని ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సంపత్ తెలిపారు. ఛార్జీల పెంచడాన్ని యూనియన్ స్వాగతించింది. పెంచిన ధరలు డిసెంబర్ 01 నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం.