CM Stalin : సనాతన ధర్మంపై మాట్లాడటం మాని కేంద్ర వైఫల్యాలను ఎండగట్టండి : సీఎం స్టాలిన్ సూచన

సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.

CM Stalin : సనాతన ధర్మంపై మాట్లాడటం మాని కేంద్ర వైఫల్యాలను ఎండగట్టండి : సీఎం స్టాలిన్ సూచన

Sanatan Dharma CM MK Stalin

CM Stalin : సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM M K Stalin) కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin)చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఉదయనిధిపై ఘటు విమర్శలతో విరుచుకుపడ్డాయి. ప్రధాని మోదీ కూడా స్పందిస్తు ఇటువంటి వ్యాఖ్యలపై గట్టి సమాధానం ఇవ్వాలని సూచిచారు. దీని గురించి సీఎం స్టాలిన్ స్పందిస్తు ‘‘ఉదయనిధి ‘సనాతన ధర్మం’ గురించి ఏం మాట్లాడారో తెలియకుండా ప్రధాని వ్యాఖ్యలు చేయడం అన్యాయం.. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి’’అని అన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం స్టాలిన్ (CM M K Stalin)సనాతన వ్యాఖ్యల గురించి మరోసారి స్పందించారు. ఇక సనాతన ధర్మం వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని..తన వైఫల్యాలను కల్పిపుచుకునేందుకు బీజేపీ చేస్తున్న ఇటువంటి యత్నాలపై పోరాడాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన వైఫల్యాలను కప్పిపుచుకునేందుకు..ప్రజల దృష్టి మరల్చేందుకు ఇటువంటి అంశాలను తెరపైకి తెస్తోంది కాబట్టి ప్రతీ ఒక్కరు సమన్వయంతో మాట్లాడాలని సూచించారు.

CM MK Stalin : కుమారుడు ఉదయనిధి ‘సనాతన’వ్యాఖ్యలపై నోరు విప్పిన సీఎం స్టాలిన్ .. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ప్రధానికి కౌంటర్

సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.

‘సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజలను దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ ఈ విశయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలి.’ అని స్టాలిన్ తమ పార్టీ వర్కర్లకు తెలిపారు. కాబట్టి బీజేపీ యత్నాలను..చేష్టలను తిప్పికొట్టేలా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ ట్రాప్ లో పడకుండా బీజేపీ ప్రభుత్వం అవినీతిపై చర్చ జరకుండా చేస్తున్న యత్నాలను తిప్పికొట్టేలా దానిపై దృష్టి పెట్టాలని సూచించారు.

మతపరమైన అంశాలను నిరంతం పైకి తెస్తు..నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని కాపాడాలని ప్రజల హక్కులను కాపాడాలని సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని సూచించారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కాబట్టి బీజేపీ ట్రాప్ లో పడకుండా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సీఎం స్టాలిన్ తన పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, అలాగే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా కూటమి పార్టీల నాయకులను కసిపై దృష్టి పెట్టాలని కోరారు.