మోడీ-షా అజెండాలోని తదుపరి కీలక ఇష్యూలు ఇవే!

  • Published By: venkaiahnaidu ,Published On : January 27, 2020 / 03:30 PM IST
మోడీ-షా అజెండాలోని తదుపరి కీలక ఇష్యూలు ఇవే!

Updated On : January 27, 2020 / 3:30 PM IST

భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్పటికప్పుడూ చీల్చిచెండుతూనే ఉంది మోడీ-షా ద్వయం. సూటు బూటు సర్కార్ అంటూ విపక్షం మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించే సమయంలో పీవోకేలో టెర్రర్ క్యాంప్ లపై సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రస్తావించింది బీజేపీ. అధికార పార్టీ చెప్పిన అచ్చే దిన్ ఎక్కడికి పోయాయంటూ విపక్షాలు తమ గొంతుకు పదుపుపెట్టే సమయంలో బాలాకోట్ దాడుల గురించి మాట్లాడుతూ మోడీ విపక్షాలకు చెక్ పెట్టగలిగారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక…మొదటినుంచి చెబుతున్నట్లుగానే ఆర్టికల్ 370ని,ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసిన మోడీ సర్కార్..అయోధ్య ఇష్యూలో సుప్రీం ఇచ్చిన తీర్పు క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడంలో విజయం సాధించింది. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. అయితే మోడీ సర్కార్ తీసుకోబోయే తదుపరి చర్య గురించి విపక్షాలు అంచనావేయలేకపోతున్నాయి. అదే సమయంలో ఒకదాని వెంట మరొకటిగా బీజేపీ తమ అజెండా వైపుగా ముందుకెళ్తూ ఉంది. ఈ సమయంలో  బీజేపీ చర్యలకు ప్రతిస్పందించడానికి విపక్ష నాయకులు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొటున్నారు. బీజేపీ ఎల్లప్పుడూ తమ రాజకీయ విరోధులను ట్విస్టర్ మ్యాట్ పై ఉంచుతోంది. ప్రతిపక్షం బీజేపీని అధిగమించడం మాట అటుంచితే ముందు అసలు వాళ్ల తదుపరి కదలికను ఊహించలేకపోతుంది.

పొలిటికల్ ట్విస్టర్
CAA,NPR,NRC లపై రాజకీయ వివాదాలు దీనికి తాజా ఉదాహరణ. ఓ వైపు ఢిల్లీ షాహీన్ బాగ్,లక్నో క్లాక్ టవర్ల దగ్గర నెల రోజులుగా సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రజలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అనేకచోట్ల ప్రజలందరూ రోడ్డపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే విపక్ష నాయకులు మాత్రం ఇంకా వాళ్ల డ్రాయింగ్ రూంలో కూర్చొని లాభ-నష్టాల గురించి అంచానాలు వేస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకులను చాలా కాలం పాటు ట్విస్టర్ మ్యాట్ పై ఉంచేలా..పాత ఇష్యూలను భర్తీ చేయడానికి బీజేపీ దగ్గర కనీసం మూడు కొత్త ఇష్యూలు ఉన్నాయి. ఈ కొత్త ఇష్యూల గురించి చెప్పే ముందు ఇటీవల ఓ బీజేపీ నాయకులు చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుందాం. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండి..ఇప్పుడున్నట్లుగా దేశ ఎకానమీ ఉండి ఉంటే…వేలసంఖ్యలో ఎడ్లబండ్లు,ట్రాక్టర్లలో రైతులను ఎక్కించుకొని పార్లమెంట్ బిల్డింగ్ బయట,ప్రధానమంత్రి,మంత్రుల నివాసాల బయట ఆందోళనలు చేపేవాళ్లం. ఈ గజిబిజి ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటికి వెళ్లేవాళ్లమని,కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని ఆ నాయకుడు ఆఫ్ ద రికార్డ్ అన్నారు.

కొత్త కోర్(ముఖ్యమైన)అజెండా

బీజేపీ మొదటి ముఖ్యమైన అజెండా నిస్సందేహంగా సీఏఏ,ఎన్ఆర్సీ. ఒకరోజులో మోడీ,అమిత్ షా ఎన్నిసార్లు సీఏఏ గురించి మాట్లాడుతుంటారో మీరే గమనించండి. ఎన్ఆర్సీ విషయానికొస్తే…భవిష్యత్తులో ఇది అమలు చేయబడదని వారిద్దరూ చెప్పలేదు. కానీ పత్రిసారీ వాళ్లు దీనిపై వివరణ ఇచ్చినప్పుడు “ఇప్పుడు కాదు” అనే మాత్రమే చెబుతున్నారు. ఎన్ఆర్సీ అనేది బీజేపీకి ఉన్నఫలంగా పరిష్కారం కాని మరో అయోధ్య. ఇది దీర్ఘకాలిక రాజకీయ ఉపయోగ అస్త్రం.

రెండో ముఖ్యమైన అజెండా జనాభా నియంత్రణ పాలసీ. గతేడాది స్వాతంత్యదినోత్సవ సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని మోడీ జనాభా పెరుగుదల గురించి ప్రస్తావించారు. నీతి ఆయోగ్ గత నెలలో జనాభా స్థిరీకరణపై సమావేశాన్ని ఎలా సమావేశపరిచారో గుర్తుంచుకోండి. దానిని వాయిదా వేయడానికి మాత్రమే. దీనిని తక్షణం తీసుకురావట్లేదు. ఇప్పటికే CAA, NPR,NRC డిబేట్ కావాల్సినంత హీట్ పుట్టిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రం ఈ జనాభా నియంత్రణ ఇష్యూని అప్పుడప్పుడూ ప్రస్తావిస్తూ ఇష్యూని సజీవంగా ఉంచారు. అయితే రెండు పిల్లల నిబంధనను సంఘ్ పేర్కొనలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనిపై పిలుపునివ్వాలని కోరుకుంటుంది. కాని చర్చ చివరికి ఏ విధంగా మారుతుందో ఊహించటానికి మేధావికి ఇంతకన్నాఅవసరం లేదు. పాపులేషన్ పాలసీపై ప్రతిపక్ష శిబిరంలో చీలిక వస్తుందని బీజేపీ వ్యూహకర్తలు ఇప్పటికే ఆనందపడుతూ ఉండవచ్చు. 

మైనారిటీలు అనుభవించిన హక్కులు బీజేపీ దృష్టి సారించడానికి సిద్ధమవుతున్న మూడవ ఇష్యూ. ఇది హిందువులపై వివక్ష అంటూ మైనార్టీ సంక్షేమ పథకాలకు 4వేల700కోట్లు కేటాయింపులను సవాల్ దాఖలైన పిటిషన్ కు స్పందనగా మోడీ ప్రభుత్వం ఇప్పటికే… ఈ పిటిషన్ చట్టం యొక్క గణనీయమైన ప్రశ్నను లేవనెత్తిందని,దీనిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాల్సిఉందన్నారు. ఈ పిటషన్ ను సనాతన్ హిందూ ధర్మమ్ లాయర్ విష్ణు శంకర్ జైన్ ఫైల్ చేశారు. అయోధ్య కేసులో వీహెచ్ పీ తరపు న్యాయవాదిగా కూడా విష్ణు శంకర్ జైన్ ఉన్నారు. సమాజంలోని ఓ సెక్షన్ ను బుజ్జగించడానికి టాక్స్ పేయర్ల డబ్బు ఉపయోగించబడుతుండడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. మరోవైపు మైనార్టీ విద్యాసంస్థల్లో నియాకల ఇష్యూ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది.

ఎమర్జెన్సీ ట్రిక్స్
పై మూడు ఇష్యూలు…ఎన్ఆర్సీ,జనాభా నియంత్రణ పాలసీ, ముస్లింలకు మరియు మైనార్టీ విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యక్రమాలు భవిష్యత్తులో బీజేపీ ప్రధాన ఎజెండాను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాయి. సీఏఏ,ఎన్ఆర్సీ ఇష్యూలపై అపనమ్మకంతో,మిగిలిన రెండు ఇష్యూలపై సైలెంట్ గా ఉంటున్న ప్రతిపక్షంను తన బలంతో అణిచివేయగలదని బీజేపీ అనుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అత్యవసర,ఆగత్య పరిస్థితులంటే మోడీ,అమిత్ షా అమ్ములపొదిలో చాలా అస్త్రాలు రెడీగా ఉన్నాయి. ఉదాహరణకు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన,ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ (OBC). 2002నాటి రాజ్యాంగ సవరణ ప్రకారం…2026తర్వాత మాత్రమే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నప్పటికీ…అవసరమైతే త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం అధికార మరోసారి సవరణ చేసే అవకాశముంది. అధికార పార్టీ నుంచి నియోజకవర్గాల పునర్విభజన గురించిన మాటలు  లేనప్పటికీ…మోడీ ప్రభుత్వం ఇప్పటికే  న్యూఢిల్లీ సెంట్రల్ విస్టాను పునరుద్ధరించే ప్రాజెక్టుపై వర్క్ చేస్తోంది. ఇందులో 900-1000మంది ఎంపీలు కూర్చునే సామర్థ్యంతో ఉన్న కొత్త త్రిభుజాకార పార్లమెంట్ భవనం నిర్మాణం ఉంది.