ఉడతా భక్తి : రామ మందిరానికి ముస్లిం విరాళం

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 06:24 AM IST
ఉడతా భక్తి : రామ మందిరానికి ముస్లిం విరాళం

Updated On : December 16, 2019 / 6:24 AM IST

అయోధ్యలో  శ్రీరాముడికి మందిరానికి అన్ని వర్గాల నుంచి విరాళాలు అందుతున్నాయి. ముస్లింలు కూడా విరాళాలు ఇస్తుండటం విశేషం. రామమందిరి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతీ ఇంటిలోని వారు రూ. 11తో పాటు ఒక ఇటుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన ఇక్బాల్ అన్సారీ…రామమందిర నిర్మాణానికి రూ. 11తో పాటు ఒక ఇటుకను ఇస్తున్నాననీ తెలిపారు.

సీఎం యోగి… మందిర నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యలను చేయటం మంచి విధానమనీ..ఆయన ఇచ్చిన పిలుపని అందరికీ తెలియజేస్తానని ఇక్బాల్ అన్నారీ తెలిపారు. మనం హిందుస్థాన్‌లో ఉంటున్నందున రామాలయ నిర్మాణానికి హిందూ, ముస్లింల సహకారం చాలా అవసరమని అన్నారు.

మన భారతదేశంలో ఆలయాలు, మసీదులు, గురుద్వారాల నిర్మాణానికి మతాలకు అతీతంగా అందరి భాగస్వామ్యం ఉండాలనీ..ఇటువంటివి భారత్ లో మతసామరస్యానికి నిదర్శనంగా ఉంటాయని..ప్రజలు ఒకరికి ఒకరు అన్నట్లుగా సహకారాన్నిన అందించుకోవాలని ఇక్బాల్ అన్సారీ అన్నారు.