Ayodhya mosque : అయోధ్య మసీదుకు ఏం పేరు పెట్టారంటే…డిజైన్ ఖరారు

అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...

Ayodhya mosque : అయోధ్య మసీదుకు ఏం పేరు పెట్టారంటే…డిజైన్ ఖరారు

Ayodhya mosque

Updated On : October 13, 2023 / 4:09 AM IST

Ayodhya mosque : అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు. పురాతన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రేరణ పొంది అయోధ్య ధన్నిపూర్ లో మసీదు నిర్మించడానికి డిజైన్ ను ఖరారు చేశారు. 2019వ సంవత్సరంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

Also Read :Neeraj Chopra : ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా నీరజ్ చోప్రాకు అవార్డు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు టైటిల్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ధన్నీపూర్ గ్రామంలో కేటాయించిన భూమిలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య మసీదును మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పిలుస్తామని దేశవ్యాప్తంగా ఉన్న మసీదుల సంస్థ ఆల్ ఇండియా రబ్తా-ఎ-మసీదు తెలిపింది. 1992వ సంవత్సరం డిసెంబరు 6 వతేదీన బాబ్రీ మసీదును కూల్చివేశాక, అక్కడకు 22 కిలోమీటర్ల దూరంలో మసీదును నిర్మించడానికి స్థలం కేటాయించారు.

Also Read :Operation Ajay : ఆపరేషన్ అజయ్ ప్రారంభం…ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన మొదటి విమానం

పూణే ఆర్కిటెక్ట్ ఇమ్రాన్ షేక్ మసీదు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ముంబయిలో జరిగిన సమావేశానికి హాజరైన యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ తెలిపారు. ప్రపంచంలోని అత్యంత అందమైన మసీదుల్లో ఒకటిగా అయోధ్య మసీదు నిలవనుందని ఫరూఖీ చెప్పారు. మసీదు, ఆసుపత్రి, వంటగది, లైబ్రరీ నిర్మాణం కోసం 300 కోట్లరూపాయలకు పైగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫరూఖీ వివరించారు. ‘‘మేం మసీదు నిర్మాణానికి నిధుల సేకరణ కోసం బ్లూప్రింట్ సిద్ధం చేశాం. నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతం అవుతుందని భావిస్తున్నాను. నిధులు రాగానే మసీదు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం’’ అని ఫరూఖీ చెప్పారు.