Ayodhya Ram Mandir Inauguration : పటిష్ఠ భద్రతా వలయంలో అయోధ్య.. డ్రోన్లతో గగనతల నిఘా.. 10వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు.

Ayodhya Ram Mandir Inauguration : పటిష్ఠ భద్రతా వలయంలో అయోధ్య.. డ్రోన్లతో గగనతల నిఘా.. 10వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

Ayodhya Ram Mandir

Updated On : January 22, 2024 / 8:23 AM IST

Heavy security in Ayodhya : అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నేడు రామ జన్మభూమిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు ఈ వేడుక జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏడువేల మంది హాజరుకానున్నారు. మరోవైపు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకోసం రామ జన్మభూమిలో జనవరి 16 నుంచి నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు నేటితో ముగియనున్నారు.

Also Read : Ayodhya Ram Mandir Inauguration : జగమంతా రామ నామ స్మరణ.. అయోధ్యలో కొలువుదీరనున్న రామయ్య

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు. భద్రతా విధుల్లో ఆర్ఏఎఫ్, ఏటీఎస్, కేంద్ర బలగాలు, యూపీ పోలీసులు నిమగ్నమయ్యారు. భద్రతా విధుల్లో బహుభాషా నైపుణ్యం కలిగిన పోలీసులు సిబ్బందిని ఎక్కుగా వినియోగించనున్నారు. సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ప్రజా కదలికలపై నిఘా ఉంచనున్నారు. ధరంపత్, రాంపత్ హనుమాన్ గర్హి ప్రాంతం, అషర్ఫీ భవన్ వీధుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. భద్రతా విధుల్లో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) పాల్గోనుంది.

Also Read : Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి కోసం ‘సలార్’ నిర్మాతల ప్రత్యేక రామగీతం.. ఎంత మధురంగా ఉంది..

అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్నవారికి మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు. అయోధ్య జిల్లా రెడ్ జోన్, ఎల్లో జోన్ లలో ఉంది. సరయూ నది వెంబడి భధ్రతను పెంపు చేశారు. ఇక్కడ విధుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గోనున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోనూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీని నియంత్రించడానికి, అదనపు రద్దీని మళ్లించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు.