Supreme Court: ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు? సుప్రీం సంచలన వ్యాఖ్యలు
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగా వర్తిస్తాయని తెలిపింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఓ మంత్రి చేసే ప్రకటనలు, వ్యాఖ్యలను ఆ ప్రభుత్వానికి ప్రత్యామ్యాయంగా చేసినట్లు ఆపాదించలేమని పేర్కొంది.

Azam Khan’s remarks on a gangrape that made Supreme Court review politicians’ freedom of speech
Supreme Court: ప్రజాప్రతినిధులకు భావప్రకటనా స్వేచ్ఛలో ఆంక్షలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన భావ ప్రకటనా స్వేచ్ఛలో పరిధులేమీ ఉండవని, సామాన్య ప్రజానికానికి ఎంత వరకు హక్కు ఉంటుందో వారికి అంతే హక్కు ఉంటుందని దేశ అత్యున్నత ధర్మాసనం మంగళవారం తేల్చి చెప్పింది. అయితే ప్రజా జీవితంలో ఉన్న వారు వారికి వారుగా కొన్ని పరిమితులను నియమించుకోవాలని, అయితే రాజ్యాంగం మాత్రం వారి వాక్ స్వాతంత్ర్యం హక్కుపై అదనపు ఆంక్షలను విధించడం సాధ్యం కాదని సుప్రీం పేర్కొంది.
2016 జూలైలో తన భార్య, కుమార్తె సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ సందర్భంగా సామూహిక అత్యాచార బాధితులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజాం ఖాన్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఒక పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. వాక్ స్వాతంత్ర్యం హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమేనని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం అతీతంగా ఉండకూడదని పేర్కొంది.
Bharat Jodo Yatra: వారిలా రాహుల్ని కొనలేరు.. అందానీ, అబానీలకు అదెప్పటికీ సాధ్యం కాదు: ప్రియాంక
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగా వర్తిస్తాయని తెలిపింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఓ మంత్రి చేసే ప్రకటనలు, వ్యాఖ్యలను ఆ ప్రభుత్వానికి ప్రత్యామ్యాయంగా చేసినట్లు ఆపాదించలేమని పేర్కొంది.
Uttar Pradesh: వేరే వర్గం వాళ్లతో మాట్లాడినందుకు ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి
అయితే తామేమీ పరిమితులు విధించలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. ప్రజా జీవితంలో ఉన్నవారికి స్వయంగా విధించుకునే ప్రవర్తనా నియమావళి ఉండాలని సూచించారు. పెద్ద నాయకుడి అభిప్రాయాలు ప్రభుత్వ వైఖరిని, అభిప్రాయాలను ప్రతిబింబిస్తే, ప్రభుత్వంపై సమష్టి, ప్రత్యామ్నాయ బాధ్యతను మోపవచ్చునని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ సభ్యులు ప్రసంగించడానికి తగిన నియమావళిని రూపొందించడంపై ఆయా పార్టీలే పరిశీలించాలని సూచించింది. వాక్ స్వాతంత్ర్యం హక్కుపై అదనపు ఆంక్షలను తీసుకురావలసిన బాధ్యత పార్లమెంటుదేనని సుప్రీం కోర్టు తెలిపింది.