BAJAJ CHETAK : మరోసారి భారీగా ధర పెంపు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల ప

Bajaj Chetak
BAJAJ CHETAK : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల పెరుగుదలతో దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చేతక్ మారింది. మహారాష్ట్రలో బజాజ్ చేతక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,87,390గా ఉంది. కొన్ని నెలల క్రితం వరకు ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,44,987గా ఉండేది. 2020లో లాంఛ్ చేసిన ధరతో పోలిస్తే చేతక్ ధర 60 శాతానికి పైగా పెరిగింది.
Diwali With Mi Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై రూ.75వేల వరకు డిస్కౌంట్.. షావోమీ అదిరిపోయే ఆఫర్లు
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఫేమ్-2 కింద సబ్సిడీని పెంచిన తర్వాత తాజాగా బజాజ్ కంపెనీ మరోసారి ధరల పెంచింది. ఫేమ్-2 కింద కంపెనీకి రూ.45వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ప్రస్తుతం ఇంతకంటే తక్కువ ధరకు ఓలా ఎస్ 1 ప్రొ, అథర్ 450 ఎక్స్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ స్కూటర్లు సేల్స్ లో ఉన్నాయి.
Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!
* దీనిలో 2 కిలోవాట్ బ్యాటరీలు.
* బ్యాటరీలకు మూడేళ్లు లేదా 50వేల కిమీ వ్యారంటీ.
* ఒకసారి ఛార్జింగ్ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం.
* ఇందులో రెండు మోడ్స్( స్పోర్ట్, ఎకో)
* 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి దగ్గర ఛార్జ్ చేయవచ్చు.
* ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్.
* ప్రస్తుతం బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అర్బన్ వేరియంట్ ను నిలిపివేసింది.