IBPS Clerk 2023 Notification : డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. బ్యాంకుల్లో 4వేల ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ-అర్హతలు ఇవే

IBPS Clerk : డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అక్టోబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

IBPS Clerk 2023 Notification : డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. బ్యాంకుల్లో 4వేల ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ-అర్హతలు ఇవే

IBPS Clerk 2023 Notification (Photo : Google)

Bank Jobs : మీరు బ్యాంకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంకులో కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 4045 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జూలై 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . జూలై 21 అప్లికేషన్ కు చివరి తేదీ. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 20-28 ఏళ్ల లోపు వయసు వారు దరఖాస్తుకు అర్హులు. కాగా, ఆగస్టు/సెప్టెంబర్ లో ప్రిలిమ్స్, అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు https://www.ibps.in ను చూడండి. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో నియమిస్తారు.

Also Read..AIIMS Jodhpur Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టు – క్లర్క్
దరఖాస్తు ప్రారంభం తేదీ – 01/07/2023
మొత్తం ఉద్యోగాలు – 4045
లొకేషన్ – దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేదీ – జూలై 21 2023
ఆన్ లైన్ ప్రిలిమ్స్ పరీక్షకు కాల్ లెటర్ డౌన్ లోడ్ చేసుకునే తేదీ – ఆగస్టు 2023
ఆన్ లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ – ఆగస్టు/సెప్టెంబర్ 2023
ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ తేదీ – సెప్టెంబర్ / అక్టోబర్ 2023
ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్ కు కాల్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన తేదీ – సెప్టెంబర్/అక్టోబర్ 2023
మెయిన్స్ ఎగ్జామ్ – అక్టోబర్ 2023
ప్రొవిజనల్ అపాయింట్ మెంట్ – ఏప్రిల్ 2024

Also Read.. BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

వయసు – మినిమమ్ 20 ఏళ్లు, మ్యాగ్జిమమ్ 28 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/EXSM అభ్యర్థులకు – రూ.175
UR/others – రూ.850

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో మొత్తం 77 క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణలో 27 పోస్టులు ఖాళీ ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ- ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్ లైన్ మెయిన్స్ ఎగ్జామ్
పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది.
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, ప్రతీ ప్రశ్నకు ఐదు ఆప్షన్లు.
ప్రతి రాంగ్ ఆన్సర్ కు టోటల్ మార్క్స్ నుంచి 0.25 మార్కులు కట్
ఆన్సర్ చేయని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు.

ఏయే బ్యాంకుల్లో ఉద్యోగాలు అంటే..
బ్యాంక్​ ఆఫ్​ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్​ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంక్, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్​ బ్యాంక్, పంజాబ్​ అండ్ సింధ్​ బ్యాంక్.. ఐబీపీఎస్​ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఈ బ్యాంకుల బ్రాంచుల్లో నియమిస్తారు.