Banks Closed : నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈనెల 28 నుంచి 29వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి.

Banks Closed : నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Banks Bandh

Updated On : March 26, 2022 / 9:14 AM IST

Banks closed for four days : బ్యాంకింగ్ సేవలకు మరోసారి ఆటంకం కలగనున్నాయి. సెలవులు, సమ్మెలతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈ నెల 28 నుంచి 29 వరకు రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు పలు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. దీంతో బ్యాంకింగ్‌ సేవలు వరుసగా నాలుగు రోజులు కస్టమర్లకు దూరమవుతున్నాయి.

Bank Holidays : ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస సెలవులు.. ముందే పనులు పూర్తి చేసుకోండి

ఇవాళ నాలుగో శనివారం, రేపు ఆదివారం, ఆ తర్వాత రెండు రోజులు సమ్మె. పలు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నట్లు, దీంట్లో అన్ని యూనియన్లకు సంబంధించిన ఉద్యోగులు హాజరుకావాలని A.I.B.E.A వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, ఈ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ, పీఎన్‌బీలు ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. కస్టమర్లకు ఆన్‌లైన్ సేవల్లో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.