Corona-19 : కరోనాతో 1,200 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి : బ్యాంకు ఉద్యోగుల సంఘం

Corona-19 : కరోనాతో 1,200 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి : బ్యాంకు ఉద్యోగుల సంఘం

Banks Have Lost Over 1000 Employees

Updated On : May 17, 2021 / 4:02 PM IST

Banks Have Lost Over 1000 Employees : కరోనా బారిన పడి 1000కి పైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ శనివారం (మే 16,2021) వెల్లడించారు.

కరోనా సమయంలో వైద్య సిబ్బంది. పారిశుద్ద్య కార్మికులు, పోలీసులతో పాటు బ్యాంక్ ఉద్యోగులు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లేనని..అన్నారు నాగరజన్. విధుల్లో భాగంగా కరోనా మహమ్మారిని బ్యాంక్ ఉద్యోగుల్ని కూడా కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాదిమంది కరోనా బారిన పడ్డారని తెలిపారు.

ఇప్పటిదాకా 1,200 మంది దాకా ఉద్యోగులు చనిపోయారని ఆలిండియా బ్లాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం చెప్పారు. బ్యాంకులు కేసులు, మరణాలకు సంబంధించి సరైన సంఖ్య చెప్పట్లేదని, మరింత ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అన్నారు. బ్యాంకు ఉద్యోగులకే కాకుండా..బీమా సంస్థల ఉద్యోగులకూ కరోనా ప్రమాదం ఎక్కువగా ఉందని, వారికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి దేవశీష్ పాండా రాష్ట్రాలకు లేఖ రాశారు.