కన్నీళ్లు ఆగలేదు : మహీంద్రా భావోద్వేగ ట్వీట్

  • Published By: madhu ,Published On : September 22, 2019 / 04:43 AM IST
కన్నీళ్లు ఆగలేదు : మహీంద్రా భావోద్వేగ ట్వీట్

Updated On : September 22, 2019 / 4:43 AM IST

ఓ చిన్న పిల్లవాడు..రెండు చేతులు లేవు..ఆహారం తినడానికి అష్టకష్టాలు పడుతున్నాడు..కాలితో ఓ చెంచా మధ్యలో చెంచా ఉంచుకుని..ఆహారం నోట్లో వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు..కొద్దిసేపటికి కొద్ది ఆహారం నోట్లో పడింది…కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వీడియో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాసేపటికే ఈ వీడియో వైరల్ అయ్యింది. మొత్తం 17 సెకన్ల నిడివి ఉంది. 

వైకల్యం శరీరానికి కానీ..మనస్సుకు కాదు..అని నిరూపించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అసాధారణ ప్రతిభతో తమేంటో రుజువు చేసుకున్నారు. రెండు చేతులు పుట్టిన చంటోడు..ఎవరి అవసరం లేకుండా..ఆహారాన్ని తనకు తానుగా తీసుకోవడం అందరినీ కదిలిస్తోంది. 

‘ఈ మధ్యే నా మనవడిని చూశా. వాట్సప్‌లో చూడగానే కన్నీళ్లు ఆపులేకపోయాను.  ఎలాంటి లోపాలు, సవాళ్లను బహుమతిగా భావించాలి. జీవితం మనకో బహుమతి. దానిని అందంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. ఇలాంటి దృశ్యాలు నాలో ఆశావాహ దృక్పథాన్ని పెంచుతాయి’ అంటూ ట్వీట్‌లో వెల్లడించారు మహీంద్రా.