అమ్మవారి ఆలయానికి రూ. 700 కోట్లు విరాళమిచ్చిన వ్యాపారి

Bengaluru businessman to donate Rs 700 crore : తాము అనుకున్నది నెరవేరితే…దేవుడి ఆలయాలకు కానుకలు సమర్పించుకుంటుంటారు. కొంతమంది భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు. మరికొంతమంది ఇచ్చిన విరాళాలను చూసి షాక్ తింటుంటారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఒకటి కాదు..రెండు కాదు.ఏకంగా రూ. 700 కోట్లు విరాళం ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. అమ్మవారి దయ వల్లే..తన వ్యాపారం బాగా సాగుతోందని, అందుకే విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ యాత్రికుల కేంద్రంగా మార్చడానికి ఇచ్చానన్నారు. బెంగళూరుకు చెందిన Gaanasravan బంగారం వ్యాపారం చేస్తుంటాడు. తన గురువు సూచన మేరకు కొచ్చిలోని Chottanikkara temple లో పూజలు చేసిన తర్వాత..తన వ్యాపారం వృద్ధి చెందిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారం విస్తరించిందని, దీనికంతటికీ కారణం అమ్మవారి దయవల్లేనని నమ్ముతున్నట్లు తెలిపారు. అందువల్ల తన సంపాదనలో కొంత భాగాన్ని ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఆలయ గర్భగుడిని బంగారుమయం చేయాలని ప్రతిపాదించారు. తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారం వద్ద రెండు భారీ గోపురాలు నిర్మించతలపెట్టినట్లు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ నిర్మాణం కోసం రూ. 300 కోట్లు కేటాయించారు. ఇక మిగిలిన మొత్తాన్ని సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి, గెస్ట్ హౌస్ లు, ఆడిటోరియం, మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి సరఫరా, రెండు రింగ్ రోడ్ల వెడల్పు కోసం ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Chottanikkara temple వద్ద 500 పడకల ఆసుపత్రిలో కులం, మతం అనే బేధం లేకుండా..ఉచితంగా చికిత్సను అందచేయబడుతుందన్నారు. 300 గదులతో 7 గెస్ట్ హౌస్ ల నిర్మాణం, 5 వేల మంది సరిపోయేలా అనాథాశ్రమం ఏర్పాటుకు ప్రణాళికలు రచించామన్నారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తరహాలో Chottanikkara temple ను అంతర్జాతీయ తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతేగాకుండా..ఆలయానికి ముందున్న చెరువు పునరుద్ధరించబడుతుందని, రూ. 3 కోట్ల వ్యయంతో అన్నదానం (ఉచితంగా) కోసం డైనింగ్ హాల్ తయారు చేస్తామన్నారు.
Cochin Devaswom Board (CDB) ఆధ్వర్యంలో Gaanasravan’s company విభాగం ఈ పనులు అమలు చేయనుంది. స్వామీజీ గ్రూప్, సీడీబీ పేరిట ఉమ్మడి ఖాతా తెరువనున్నారు. పనులను పర్యవేక్షించడానికి సీబీబీ ఒక చీఫ్ ఇంజినీర్ ను నియమించనుంది. కేరళ హైకోర్టు Devaswom bench ప్రాజెక్టును మంజూరు చేసిన అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. 2021 జనవరిలో పనులు మొదలు పెట్టి..ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నారు.