బెంగళూరులో భారీ శబ్ధం.. అది Sonic Boom?

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 02:26 PM IST
బెంగళూరులో భారీ శబ్ధం.. అది Sonic Boom?

Updated On : May 20, 2020 / 2:26 PM IST

బెంగళూరులో వినిపించిన భారీ శబ్ధం ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడలా చేసింది. బుధవారం మధ్యాహ్న సమయంలో వినిపించిన ఈ శబ్ధంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధ తీవ్రతను బట్టి కొందరు తలుపు, కిటికీలు, కొన్ని ఇళ్లు విరిగిపడ్డాయేమో అనుకున్నారట. కొందరు ఏలియన్లు వచ్చారంటుంటే నెటిజన్లు దీనిని సోనిక్ బూమ్ అంటున్నారు. 

సోనిక్ బూమ్ అంటే ఏంటంటే… ఇది షాక్ తరంగాలతో పాటు కలిసి ఉంటుంది. ఏదైనా వస్తువు ధ్వని వేగం కంటే స్పీడ్ గా ప్రయాణిస్తే వచ్చే తరంగాలు ఒక శబ్ధాన్ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు లెక్కలేనంత శక్తి ఉత్పన్నమవుతుంది. అది ఒక పేలుడుకు సమానంగా ఉంటుంది. ఏదైనా వస్తువు సూపర్ సోనిక్ స్పీడ్ తో ప్రయాణిస్తే.. పుట్టే కంటిన్యూస్ ఎఫెక్ట్ ఇలా శబ్ధం చేసి ఉండొచ్చు. 

బెంగళూరు పోలీసులు సైతం దీనిపై ఎటువంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవించినట్లు తమకు ఫోన్ రాలేదని వారు వెల్లడించారు. ఎమ్ఎన్ అనుచెత్ డీసీపీ వైట్ ఫీల్డ్ డివిజన్ శబ్ధం వెనుక కారణాల గురించి విచారిస్తున్నామని తెలిపారు. 

ఈ మిస్టరీయస్ సౌండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, కళ్యాణ్ నగర్, ఎంజీ రోడ్డు, మరాఠాహల్లీ, వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి హెబ్బగోడీ ప్రాంతాల వరకూ శబ్ధం వినిపించింది. రెండేళ్ల క్రితం కూడా బెంగళూరులో ఇదే సౌండ్ వినిపించింది. 2018 ఆగష్టులో పెద్ద పేలుడు సంభవించినట్లుగా అనిపించిందని అప్పడు రాజరాజేశ్వరి నగర్, దక్షిణ బెంగళూరులోని ప్రాంతవాసులు చెబుతున్నారు.