7 నెలల్లో ఇదే ఫస్ట్ టైం: 24 గంటల్లో బెంగళూరులో జీరో కరోనా మరణాలు

Bengaluru Zero COVID Deaths In 24 Hours : కర్నాటకలోని బెంగళూరులో గడిచిన 24 గంటల్లో ఒక కరోనా మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో మైసూరు, తుమకూరులో మాత్రమే ఒక్కో కరోనా మరణం నమోదయ్యాయి. బెంగళూరులో గత 7 నెలల్లో మొదటిసారి జీరో కరోనా మరణాలు రికార్డు అయ్యాయి.
2020లో జూన్ 7న ఒక కరోనా మరణం నమోదు కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు సింగిల్ కరోనా మరణం కూడా నమోదుకాలేదు. దాంతో రాష్ట్రంలో రోజువారీ కరోనా మరణాల రేటు 1.3శాతంగా నమోదైంది.
కర్నాటకలో మొత్తం 792 కరోనా కొత్తకేసులు నమోదుకాగా.. బెంగళూరులో 453 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రోజువారీ కరోనా పరీక్షలు 1.1లక్షలు నిర్వహించగా పాజిటివ్ రేటు 0.69శాతంగా నమోదైంది.
రాష్ట్రంలో 14 జిల్లాల్లో 10 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9649 కాగా, మొత్తం కరోనా కేసుల్లో ఇప్పటివరకూ 1శాతం మాత్రమే నమోదయ్యాయి.