Bharat Shakti Exercise Pokhran : పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్ శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు

Bharat Shakti Exercise Pokhran : మేకిన్ ఇండియా విజయం మన కళ్లముందే ఉందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెపన్స్, ట్యాంకులు, యుద్ధనౌకలు, హెలికాప్టర్లు, మిస్సైల్స్ భారత్ శక్తికి నిదర్శనమన్నారు మోదీ.

Bharat Shakti Exercise Pokhran : పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్ శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు

Bharat Shakti Exercise In Pokhran

Updated On : March 13, 2024 / 2:20 PM IST

Bharat Shakti Exercise Pokhran : ఆయుధ సంపత్తి విషయంలో అగ్రదేశాలతో పోటీ పడుతోంది భారత్. మన ఆయుధ సత్తాను తెలియజేస్తూ రాజస్థాన్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. భారత్ శక్తి పేరుతో 50నిమిషాల పాటు విన్యాసాలు జరిగాయి. 30కిపైగా దేశాల ప్రతినిధులతో పాటు ప్రధాని నరేంద్రమోదీ ట్రైసర్వీస్ ఫైరింగ్, ఎక్సర్‌సైజ్ ను వీక్షించారు.

Read Also : అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్ష విజయవంతం.. ప్రత్యేకతలేంటో తెలుసా?

భారతదేశం ఆత్మనిర్భర్‌లో భాగంగా.. రక్షణరంగంలో పురోగతి సాధించడం గర్వకారణమన్నారు ప్రధాని. మేకిన్ ఇండియా విజయం మన కళ్లముందే ఉందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెపన్స్, ట్యాంకులు, యుద్ధనౌకలు, హెలికాప్టర్లు, మిస్సైల్స్ భారత్ శక్తికి నిదర్శనమన్నారు మోదీ. పదేళ్లలో మనం రక్షణరంగంలో దేశాన్ని సెల్ఫ్ మేడ్‌గా మార్చేందుకు ఒకదాని తర్వాత ఒకటి  విజయాలను సాధిస్తున్నామని చెప్పారు ప్రధాని.

ఆద్యంతం ఆకట్టుకున్న ప్రదర్శన :
తేజస్ యుద్ధ విమానాలు, డ్రోన్ విధ్వంసక ఎక్విప్‌మెంట్, అధునాతన ఆయుధాలు, క్షిపణుల వరకు ప్రతి ఆయుధం శత్రువులను ఎలా ఖతం చేస్తుందో కళ్లకు గట్టారు సైనికులు. మన సెల్ఫ్ మేడ్ తేజస్ యుద్ధవిమానాలు శత్రు శిబిరాలు, బంకర్లను ధ్వంసం చేసే ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రాడ్‌ బీఎం 21 రాకెట్ లాంఛర్లు, ధనుష్‌ గన్‌ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్‌ శత్రువులపై ఎలా ఉపయోగిస్తారో ప్రదర్శించారు.

K9 వజ్రా యుద్ధ ట్యాంకు శత్రు బంకర్లను ముక్కలు ముక్కులుగా చేసిన తీరు అట్రాక్ట్ చేసింది. శత్రువుల వేటలో డ్రోన్లను ఎలా వాడతారో సైన్యం ప్రదర్శించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా BMP-2 వాహనాలు దుమ్మురేపుకుంటూ యుద్ధక్షేత్రంలో ఎలా దూసుకుపోతాయో చూపించారు.

అర్జున యుద్ధ ట్యాంకుల పనితీరు అద్భుతం  :
అర్జున యుద్ధ ట్యాంకుల పనితీరు ఆకట్టుకుంది. వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ LH మార్క్‌-4 చేసిన ఫైరింగ్‌ అబ్బురపరిచింది. గగనతలంలో లక్ష్యాలను కూల్చివేసే ప్రక్రియ అద్భుతంగా ప్రదర్శించారు. వాయుసేనకు చెందిన షిక్రా మానవ రహిత విమానాన్ని.. BLT-72 ట్యాంకులు క్షణాల్లోనే ధ్వంసం చేశాయి. శత్రువులు పంపే డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసే నావల్‌ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ సత్తా చాటింది.

క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్‌, ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ మొబిలిటీ వెహికల్, లైట్ బులెట్ ప్రూఫ్‌ వాహనాల సాయంతో సైనికులు ఎలా శత్రువులతో యుద్ధం చేస్తారో ప్రదర్శించారు. ఆధునిక తుపాకులు, రాకెట్ లాంచర్లతో శత్రువును వేగంగా మట్టికరిపించే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. త్రివిధ దళాలు శత్రువును క్షణాల్లోనే చుట్టుముట్టి ఏవిధంగా నాశనం చేస్తాయో చూపించిన ప్రక్రియ ఆకట్టుకుంది.

Read Also : China: మరో కలకలం.. అణు బాంబుల పరీక్షకు సిద్ధమైన చైనా.. ప్రపంచానికి ఇలా తెలిసిపోయింది..