మోడీకి భూటాన్ ప్రధాని ఫోన్
భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫోన్ చేశారు.

Bhutan Pm Lotay Tshering Speaks To Pm Modi Assures Assistance Amid Covid 19 Outbreak
Bhutan PM భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం, ప్రజలు చేస్తున్న కృషికి భూటాన్ ప్రధాని సంఘీభావం తెలియజేశారని ప్రధానమంత్రి కార్యాలయం(PMO)తెలిపింది.
వనరుల కోసం భారత్ పై ఆధాపరడిన దేశమైనప్పటికీ..ఈ సమయంలో తమ వంతుగా భారత్ కు చేయగలినది చేస్తామని భూటాన్ ప్రధాని ప్రకటించారు. కష్టాల్లో ఉన్న భారత్ కు తన వంతు సహకారం అందిస్తున్న భూటాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భూటాన్‌లో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్న ఆ దేశపు రాజు నాయకత్వాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం…4లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను భూటాన్ కు సాయంగా పంపిన విషయం తెలిసిందే.