ఉద్యోగులకు శుభవార్త : రూ.5 లక్షల వరకు ఇన్ కం ట్యాక్స్ లేదు

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 07:11 AM IST
ఉద్యోగులకు శుభవార్త : రూ.5 లక్షల వరకు ఇన్ కం ట్యాక్స్ లేదు

Updated On : February 1, 2019 / 7:11 AM IST

కేంద్ర బడ్జెట్ లో ఉద్యోగులకు గుడ్ చెప్పారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఇక నుంచి ఇన్ కం ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏడాది జీతం రూ.6.50 లక్షలుగా ఉన్న వారు సైతం.. బీమా, పెన్షన్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టటం ద్వారా ఆదాయ పన్ను పరిమితి నుంచి మినహాయింపు పొందవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే సంవత్సర ఆదాయం రూ.6.50 లక్షలు ఉన్నా.. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

మధ్య తరగతికి ఇది భారీ ఊరట. ప్రస్తుతం రూ.2.50లక్షల వరకు మాత్రమే ఈ వర్తింపు ఉంది. ఇప్పుడు రెట్టింపు అయ్యింది. మధ్యతరగతి ప్రజలు ఊహించిన దానికంటే అధికంగా ఆదాయ పన్ను పరిమితి ఇచ్చింది కేంద్రం. ఈ నిర్ణయం కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం జరగనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది.