బీజాపూర్‌లో భీకర కాల్పులు : 11మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 07:42 AM IST
బీజాపూర్‌లో భీకర కాల్పులు : 11మంది మావోయిస్టులు మృతి

Updated On : February 7, 2019 / 7:42 AM IST

ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ :

మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి

చెందారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌‌లోని బైరామ్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతాబలగాలు అలర్ట్ అయ్యాయి. అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాబలగాలకు, మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 11మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఐజీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు.

 

కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. జాతీయ వారోత్సవాలను కూడా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. అప్రమత్తమైన కేంద్ర బలగాలు అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.     ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. 30మందికిపైగా మావోయిస్టులు ఉన్నారు. వారు తమపై కాల్పులకు దిగడంతో తాము ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కాల్పుల్లో 11మంది మావోయిస్టులు స్పాట్‌లోనే చనిపోయారు.

 

ఇటీవల కాలంలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకూడదని మావోయిస్టులు కరపత్రాలు పంచుతున్నారని.. జాతీయ రహదారులపై బ్రిడ్జిలు కూల్చి వేసి వాహనాల రాకపోకలు ఆపేస్తున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు, మావోయిస్టుల ఏరివేతకు ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన భద్రతా బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో.. 2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం రాత్రి నుంచి ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. వారి కూంబింగ్ ఫలించింది. వ్యూహాత్మకంగా జరిపిన కాల్పుల్లో 11మంది మృతి చెందడం.. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.