పెళ్లి జరిగి రెండేళ్లు దాటినా భర్త తనను ముట్టుకోవట్లేదని భార్య ఏం చేసిందో తెలుసా?

ఈ విషయం తన అత్తమామలకు కూడా చెప్పానని, కానీ వారు పట్టించుకోలేదని తెలిపింది. తన భర్తనువ దీనిపై నిలదీశానని..

పెళ్లి జరిగి రెండేళ్లు దాటినా భర్త తనను ముట్టుకోవట్లేదని భార్య ఏం చేసిందో తెలుసా?

AI Image Generated by Canva

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ మహిళ తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. పెళ్లయి రెండేళ్లు దాటినప్పటికీ భర్త తనను ముట్టుకోవడ్లేదని చెప్పింది. దీంతో రాత్రుళ్లు ఒంటరిగా నిద్రించాల్సి వస్తుందని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త సహా ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో తన భర్తపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు 2021, మే 13న పెళ్లయిందని, తన భర్తతో శారీరక సంబంధం లేకుండా పోయిందని ఆమె చెప్పింది. ఈ విషయం తన అత్తమామలకు కూడా చెప్పానని, కానీ వారు పట్టించుకోలేదని తెలిపింది.

తన భర్తను దీనిపై నిలదీశానని, దీంతో అతడు వేధించడం ప్రారంభించాడని మహిళ చెప్పింది. తనను తరచూ కొట్టేవాడని తెలిపింది. తాను తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం గురించి మాట్లాడినప్పుడు.. ఇంట్లో నుంచి బయటకు వస్తే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది.

ఒకరోజు తన తాతయ్యకు అనారోగ్యంగా ఉందని తన తల్లి ఇంటికి వచ్చేశానని బాధిత మహిళ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు తనను బెదిరిస్తూనే ఉన్నారని తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళతో ఆమె భర్త ఎన్నడూ సన్నిహితంగా మెలగలేదు. భర్త వద్దకు తిరిగి వెళ్లాలని ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. అందుకే చివరికి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి వచ్చిందని పోలీపులు చెప్పారు.

Read Also: తండ్రి తిట్టినా.. భార్యను వెనకేసుకొస్తున్న రవీంద్ర జడేజా.. తన సక్సెస్‌కి ఆమె కారణమట!