Rahul Gandhi: బీజేపీ దేశాన్ని రెండు దేశాలుగా విడగొడుతుంది – రాహుల్ గాంధీ
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యాలివేనంటూ విమర్శలకు దిగారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్ పూర్ ర్యాలీ గురించి వివరిస్తూ బీజేపీ దేశాన్ని రెండు భాగాలుగా...

Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యాలివేనంటూ విమర్శలకు దిగారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్ పూర్ ర్యాలీ గురించి వివరిస్తూ బీజేపీ దేశాన్ని రెండు భాగాలుగా విడగొడుతుందంటున్నారు. ఒకటి బిలీయనర్లదైతే మరొకటి పేదవాళ్లదని అభిప్రాయపడ్డారు.
‘మన దేశాన్ని బీజేపీ రెండు భాగాలుగా విడగొడుతుంది. 100 నుంచి 500 మంది ఉన్న బిలీయనర్లకు ఒక భాగం, రెండో భాగమంతా పేదవాళ్లే. ఇండియాలోని పేదవాళ్లు భయపడుతున్నారని అనుకుంటున్నారు. వాళ్లెవరికీ భయపడటం లేదు. అభివృద్ధి అనేది ఏ పార్టీ ఇచ్చే బహుమతి కాదు. అది పేదవారు, రైతుల శ్రమ. 70 ఏళ్లుగా దేశాన్ని ముందుకు తెచ్చింది పేదలు, శ్రామికులు, రైతులే’ అని అన్నారు రాహుల్.
దేశంలోని 100 మంది ధనికులు పేదవారి కంటే 40శాతం ధనవంతులుగా ఉన్నారని అంటున్నారు.
Read Also: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!
‘వాళ్లకు వీళ్లకు ఉన్న తేడా అదే. యావత్ దేశమంతా బాగుపడాలని కోరుకోవాలి. ఏదో కొందరు వ్యక్తులు కాదు. పలు సిద్ధాంతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్న దేశంలో ఒకే సిద్ధాంతంతో ఉండాలని కోరుకుంటున్నారు. బుధవారం పార్లమెంట్ వేదికగా ఇలాంటి జరగనివ్వబోమని చెప్పామని అన్నారు రాహుల్.