బీజేపీ అభ్యర్థిని కొట్టి.. కాళ్లతో తన్నిపడేసిన టీఎంసీ కార్యకర్తలు

  • Published By: veegamteam ,Published On : November 25, 2019 / 08:57 AM IST
బీజేపీ అభ్యర్థిని కొట్టి.. కాళ్లతో తన్నిపడేసిన టీఎంసీ కార్యకర్తలు

Updated On : November 25, 2019 / 8:57 AM IST

పశ్చిమబెంగాల్‌లో ఐదవ విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ పై  సోమవారం (నవంబర్ 25)న పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కాళ్లతో తన్నారు. దీంతో మజుందార్ రోడ్డు పక్కనే  ఉన్న పొదల్లో పడిపోయారు. 

కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఓటింగ్ జరుగుతుండగా..ప్రకాష్ మజుందార్ పోలింగ్ బూత్‌ దగ్గరకు పరిశీలించటానికి కారులో  వచ్చారు. అనంతరం కారు దిగి పోలింగ్ బూత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు మజుందార్ పై దాడికి దిగారు. ఆయన్ని రోడ్డు మీదనే లాగిపడేశారు.  నానా యాగీ చేసి కాళ్లతో తన్ని తోసిపడేశారు. దీంతో పట్టుతప్పిన ఆయన రోడ్డు పక్కనే ఉన్న చెట్టు పొదల్లో పడిపోయారు. వెంటనే లేచిన ఆయన సదరు వ్యక్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్ లో ప్రజాస్వామ్యం కరవైపోయిందన్నారు. 

టీఎంసీ కార్యకర్తలు రిగ్గింగ్ లకు పాల్పడుతున్నారనే సమాచారంతో తాను వచ్చాననీ కానీ టీఎంసీ కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి తనపై చేయి చేసుకున్నారని వాపోయారు. తనపై దాడులు జరిగినా సరే పోలింగ్ బూత్ లను పరిశీలించేందుకు వెళతానని మజుందార్ అన్నారు.  దాడి తరువాత మజుందార్ ముకుల్ రాయ్ ఎన్నికల కమిషన్ కు  లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న  పరిస్థితుల్ని తెలియజేశారు.