ఏ వరాలు ఇవ్వనుందో : 7న బీజేపీ మేనిఫెస్టో

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల తేదీ సమయం దగ్గర పడుతోంది. బీజేపీ తమ మేనిఫెస్టోని ఇంకా ప్రకటించాలేదు. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెష్టోని రాహల్ గాంధీ ప్రకటించేశారు. ఈ క్రమంలో బీజేపీ ప్రజలకు ఏ వరాలు ప్రకటిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి కొన్ని పార్టీలు. ఈక్రమంలో ఉగాది పండుగ వెళ్లిన మరునాడు అంటే మార్చి 7న మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల పక్కా సమాచారం. దీనికి కమల దళం అంతా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఈనెల 11న జరగనున్న విషయం తెలిసిందే. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానికి నేతృత్వంలో పార్టీలోని సీనియర్ నేతలతో సహా మొత్తం 20మంది మొత్తం 20 మంది సభ్యులు ఆ మేనిఫెస్టోను తయారు చేశారు. మేనిఫెస్టో కమిటీలో జైట్లీ, సీతారామన్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లు ఉన్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో సమయంలోనూ పోలింగ్ తేదీకి కొన్ని రోజుల ముందే బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. పోలింగ్‌కు 48 గంటల లోపు మేనిఫెస్టో రిలీజ్ చేయరాదన్న ఎన్నికల సంఘం ఆదేశాలున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌తో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు సమావేశమయ్యి ఆదివారం నాడు మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.