Lok Sabha election-2024: 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తారని చెప్పారు.

Lok Sabha election-2024: 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియా సమావేశం నిర్వహించి ఈ జాబితాను విడుదల చేశారు. మొత్తం 195 స్థానాల అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదలైంది.

ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. గాంధీ నగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు. జాబితాలో 36 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ నుంచి తొమ్మిది సీట్ల అభ్యర్థులపై ప్రకటన చేశారు.

57 మంది ఓబీసీలకు చోటుదక్కింది. ఉత్తరప్రదేశ్‌లో 51, గుజరాత్ లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పోరుబందర్ నుంచి మన్ సుఖ్ మాండవీయ పోటీ చేయనున్నారు. కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీ ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 51, పశ్చిమ బెంగాల్‌ నుంచి 20, మధ్యప్రదేశ్‌ నుంచి 24, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి 15, కేరళ నుంచి 12, తెలంగాణ నుంచి 9, అసోం నుంచి 11, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 11 చొప్పున అభ్యర్థులను ప్రకటించింది. అలాగే, ఢిల్లీ నుంచి 5, జమ్మూకశ్మీర్ నుంచి 2, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, గోవా, త్రిపుర, అండమాన్, నికోబార్ తో పాటు డామన్, డయ్యూ నుంచి ఒక్కొక్కరి చొప్పున పేర్లను ప్రకటించింది.

ఎవరెంత మంది?

మహిళలు – 28
యువకులు – 47
ఎస్సీ- 27
ఎస్టీ -18

 

పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టె లేదని డ్రామాలు ఆడిన హరీశ్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్