Delhi : పాత పార్లమెంట్ భవనం వద్ద ఫొటో సెషన్, స్పృహతప్పి పడిపోయిన బీజేపీ ఎంపీ

ఈరోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో పాత పార్లమెంట్ భవనం ముందు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రూప్ ఫోటో సెషన్ ఆసక్తికరంగా సాగుతున్నవేళ బీజేపీ ఎంపీ నరహరి అమీన్‌ స్పృహతప్పి పడిపోయారు.

Delhi : పాత పార్లమెంట్ భవనం వద్ద ఫొటో సెషన్, స్పృహతప్పి పడిపోయిన బీజేపీ ఎంపీ

BJP MP Narhari amin

Updated On : September 19, 2023 / 11:34 AM IST

Delhi Old Parliament Bhavan : ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనం( New Parliament Bhavan) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఎంపీలు పాత పార్లమెంట్ భవనం ( Old Parliament Bhavan )ముందు గ్రూప్ ఫోటో దిగారు. మొదటిసారిగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు కలిపి పాత పార్లమెంట్ భవనం ముందు గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ నరహరి అమిన్ (BJP MP Narhari amin )గ్రూప్ ఫోటో సెషన్ (photo session )లో స్పృహ తప్పి పడిపోయారు. కానీ కాసేపటికే ఆయన కోలుకున్నారు. అనంతరం వెంటనే గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.

Minister Chandra Shekhar : రాముడు నా కలలోకి వచ్చి తనను బజార్లో అమ్మొద్దని చెప్పాడు : మంత్రి వ్యాఖ్యలు

కాగా ..ఈరోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈక్రమంలో పాత పార్లమెంట్ భవనం ముందు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రూప్ ఫోటో సెషన్ ఆసక్తికరంగా సాగుతున్నవేళ అందరు ఉత్సాహంగా ఉండగా సడెన్ గా బీజేపీ ఎంపీ నరహరి అమీన్‌ స్పృహతప్పి పడిపోయారు. దీంతో అక్కడున్నవారిలో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తోటి ఎంపీలు అంతా ఆయన వద్దకు పరుగులు పెడుతు వెళ్లారు. మంచినీరు అందించటంతో తాగిన కాసేపటికే నరహరి అమీన్ కోలుకున్నారు. తిరిగి ఫోటో సెషన్ లో పాల్గొనటంతో అందరు రిలాక్స్ అయ్యారు.