BJP MP Ramesh Bidhuri : బీఎస్పీ నేతపై బీజేపీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు
రమేష్ బిధురి వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

MP Ramesh Bidhuri comments
BJP MP Ramesh Bidhuri Objectionable Comments : బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో శుక్రవారం చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ పై చర్చ సందర్భంగా బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాది అంటూ సంభోదించారు.
రమేష్ బిధురి వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బీఎస్పీ ఎంపీ అలీపై బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో విచారం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను తాను వినలేదని, అయితే అవి విపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.
Supreme Court : సనాతన ధర్మంపై వ్యాఖ్యలు .. ఉదయనిధి,తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
సభ్యుడిపై చర్యలు చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. బిధురిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను డిమాండ్ చేశారు. రమేష్ బిధురిపై ఏం చర్యలు చేపడతారో తెలపాలని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
ముస్లింలు, ఓబీసీలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె ఆరోపించారు. బిధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విస్మయం చెందారు. బిధురిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.