ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 03:48 PM IST
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ

Updated On : March 21, 2019 / 3:48 PM IST

ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా,కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ,విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్,తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 12మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఆరుగురు అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ ను ఇవాళ బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే అరుణాచ్ ప్రదేశ్ లో 54సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇవాళ మిగిలిన ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్థుతం బీజేపీ అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అరుణాచల్ ప్రదేశ్ లోని మొత్తం 60 అసెంబ్లీస్థానాలకు,2లోక్ సభ స్థానాలకు,అదేవిధంగా సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు,1లోక్ సభ స్థానానికి మొదటి విడతలో ఏప్రిల్-11,2019న పోలింగ్ జరుగనుంది.