Rakesh Tikait : ఆ రెండు పార్టీలతో జాగ్రత్త – రాకేశ్ టికాయిత్

దేశ ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ, RSSలు ఎంత దూరమైనా వెళ్తాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.

Rakesh Tikait : ఆ రెండు పార్టీలతో జాగ్రత్త – రాకేశ్ టికాయిత్

Rakesh

Updated On : November 7, 2021 / 7:59 AM IST

BJP, RSS  : దేశ ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ, RSSలు ఎంత దూరమైనా వెళ్తాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. ఈ రెండిటితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు బీజేపీ, RSS ఎంతకైనా తెగిస్తాయని వ్యాఖానించారు. సాగు చట్టాల విషయంపై రైతులతో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి ఏడాది సమీపిస్తున్న సమయంలో టికాయిత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More : Telangana : వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ..18న డ్రా, ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు

కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే మంచిదని.. లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం తమతో ఎందుకు చర్చలు జరపడం లేదంటూ ప్రశ్నించారు. రైతు ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందంటూ నిప్పులుచెరిగారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని… తమతో మాట్లాడి.. త్వరగా ఓ నిర్ణయానికి రావాలని టికాయిత్ పేర్కొన్నారు.

Read More : Drug Racket : వరంగల్‌ మత్తు కథా చిత్రమ్!..అమ్మాయిలతో మత్తులో జోగుతూ.. విద్యార్థుల పార్టీలు

అటు హిసార్‌ జిల్లాలో బీజేపీ ఎంపీ రామ్‌ చందర్‌ జాంగ్రా కారుపై దాడి ఘటనపైనా టికాయిత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రైవేటు గూండాలు రైతుల్లో కలిసిపోయారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఎంపీ రామ్‌ చందర్‌ జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలేని తాగుబోతులే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యాఖ్యలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నర్నౌంద్‌లో కొందరు జాంగ్రా కారును అడ్డగించి వాహనాన్ని ధ్వంసం చేశారు. రైతులే ఈ దాడి చేశారని.. తనపై హత్యాయత్నం జరిగిందని ఎంపీ ఆరోపించారు.