యూపీలో బీజేపీకి 17 సీట్లే

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ అని మమత అన్నారు. ఇప్పటికి కేవలం నాలుగు దశల పోలింగ్ మాత్రమే ముగిసింది.
80లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలు గెల్చుకోగా దాని మిత్రపక్షమైన ఆప్నాదళ్ రెండు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉందని మమత అన్నారు.యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికే ప్రజాదరణ ఎక్కువగా ఉందన్నారు.మోడీ ఫాసిస్టు కంటే అధ్వానంగా తయారయ్యారని మమత విమర్శించారు.