Blue Bananas : వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ లాంటి నీలం రంగు అరటిపండ్లు

Blue Bananas : వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ లాంటి నీలం రంగు అరటిపండ్లు

Blue Bananas

Updated On : April 9, 2021 / 6:56 AM IST

Blue Java Bananas: ఒకప్పుడు పచ్చి మిర్చి అంటే ఆకుపచ్చగానే ఉండేది. ఇప్పుడు పసుపు,నారింజ, ఎరుపు రంగుల్లో కూడా వస్తున్నాయి. అలాగే క్యాబేజీ, యాపిల్స్ చాలా రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే అరటి పండ్లల్లో కూడా చాలా రకాల రంగుల్లో వస్తున్నాయి.పసుపు పచ్చ రంగు అరటి పండ్లే ఉండేవి. కానీ ఇప్పుడు ఎరుపు, ఆకుపచ్చ,గులాబీ రంగు, ఊదారంగు వంటి రంగుల్లో అరటి పండ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ అరటి పండ్లలో నీలి రంగు అరటి పండ్లు మాత్రం చూడటానికే కాదు టేస్ట్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఈ నీలి నీలి ఆకాశం రంగుల్లో కనువిందు చేస్తున్నీ ఈ నీలిరంగు అరటి పండ్ల టేస్ట్ అచ్చంగా వెనీలా ఐస్ క్రీమ్ తినట్లే ఉంటోందంటున్నారు అరటి పండ్ల ప్రియులు.

14

సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.అరటి పండ్లు అందుబాటు ధరల్లో ఉండటంతో ప్రతీ ఒక్కరూ తింటారు. దాదాపు అందరి ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు అరటిపండు. ముఖ్యంగా ప్రతీ శుభకార్యానికి అరటి పండు ఉండాల్సిందే. తాంబూలంలో అరటి పండు లేని అది తాంబూలం కానే కాదు. అలాగే శుభకార్యాలకే కాదు ఆరోగ్యానికి కూడా అరటి పండు చాలా మంచిది.

100

అరటిపండు ఇనిస్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఈ పండు అన్ని సీజన్లలో మార్కెట్లో లభించటం అరటి పండు ప్రత్యేకత. సాధారణంగా మీరు ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లు చూసి ఉంటారు లేదా తిని ఉంటారు. కానీ, నీలి అరటిపండ్లు ప్రత్యేకతే వేరు. కానీ నీలి రంగు అరటి పండ్లు తిన్నారా? అని అడిగితే లేదనే అంటారు. కనీసం చూసి కూడా ఉండరు చాలామంది. ఆమాటకొస్తే నీలి అరటిపండ్లు కూడా ఉంటాయా? అంటారు. కానీ ఈరోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటోంది. ఇలాంటివి కూడా ఉంటాయా? అనేలా ఉంటోంది నేటి పలు రకాల పంటలను పండించే పద్ధతి అందుబాటులోకి వచ్చాక..అటువంటివాటిలో నీలి రంగు అరటి పండ్ల పంట కూడా ఒకటి.

156

ఈ నీటి రంగు అరటిని ఆగ్నేయాసియాలో సాగు చేస్తారు. హవాయి దీవులలో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి. నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తున్నారు. ఎందుకంటే, చల్లటి ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దీని దిగుబడి బాగుంటుంది. అరటిని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానాలో ఎక్కువగా పండిస్తారు.

Bloue

ఈ అరటి రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట . ఈ అరటిని బ్లూ జావా అరటి అని కూడా అంటారు. నీలం రంగు అరటిని కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటారు. ఈ అరటికాయ 7 అంగుళాల పొడవు ఉంటుందని తెలిస్తే టేస్టులోనే కాదు సైజులో కూడా ఈ నీలిరంగు అరటి పండు స్పెషలేనన్నమాట అంటారు..