BMC : మాస్క్ పెట్టుకోని వారి నుంచి రూ. 58 కోట్లు వసూలు!
మాస్క్ లు పెట్టుకోకుండా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ముంబై మహానగరంలో ఇలా మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఏకంగా రూ. 58 కోట్లు వసూలు చేశారంట.

No Mask
Rs 58 Crore Fine : కరోనా ఇంకా భారతదేశాన్ని వీడడం లేదు. తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా..ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. ఈ వైరస్ కు తోడుగా..డెల్టా వేరియంట్ ఇంకా భయపెడుతోంది. కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలు రాష్ట్రాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే..మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నాయి. అయితే..కొంతమంది డోంట్ కేర్ అంటూ..మాస్క్ లు పెట్టుకోకుండా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ముంబై మహానగరంలో ఇలా మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఏకంగా రూ. 58 కోట్లు వసూలు చేశారంట.
కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉందనే సంగతి తెలిసిందే. వైరస్ నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారి నుంచి జరిమానా వసూలు చేస్తామని అధికారులు సూచించారు. వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబైలో కూడా ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నారు.
మాస్క్ పెట్టుకోకుండా..బహరింగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి రూ. 58,42,99,600 జరిమాన వసూలు చేయడం జరిగిందని బీఎంసీ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాపించినప్పటి నుంచి 2021, జూన్ 23వ తేదీ వరకు ఈ మొత్తాన్ని వసూలు చేయడం జరిగిందని, ముంబై సివిల్ పోలీసులతో పాటు రైల్వే శాఖ కూడా మాస్క్ లేని వారి నుంచి జరిమానాను వసూలు చేసింది.