కరోనాతో చనిపోయిన వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా.. అంత్యక్రియలు ఇలానే చేస్తారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మమహ్మరి ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం 200 దేశాలకు కరోనా వ్యాపించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 40వేల మంది బలయ్యారు. కాగా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు? దహనం చేస్తారా? పూడ్చి పెడతారా? అంత్యక్రియలకు కుటుంబసభ్యులను అనుమతిస్తారా? ఇలాంటి అనుమానాలు అందరికి కలుగుతుంటాయి.
కరోనాతో చనిపోయిన వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా.. అంత్యక్రియలు మాత్రం దహనం ద్వారానే జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో శవం పూడ్చి పెట్టడానికి అనుమతి ఉండదు. ఒకవేళ శవాన్ని పూడ్చి పెట్టాలని కుటుంబసభ్యులు పట్టుబడితే.. ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.
శవాన్ని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ జిప్ బ్యాగ్ లో ఉంచి, సోడియం హైపోక్లోరైట్ చల్లుతారు:
కరోనాతో చనిపోయిన వ్యక్తి ఏ మతం వారైనా శవాన్ని దహనం(cremation) చేస్తారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ జిప్ బ్యాగ్ లో ఉంచుతారు. దానిపై సోడియం హైపోక్లోరైట్(sodium hypochlorite) ద్రావణం చల్లుతారు. (దీన్ని సాధారణంగా బ్లీచింగ్ పౌడర్ లా వాడతారు. స్విమ్మింగ్ పూల్స్ క్లీన్ చేయడానికి వినియోగిస్తారు.) ఆ బ్యాగ్ ను మళ్లీ మార్చురీ షీట్ తో చుట్టి కుటుంబసభ్యులకు ఇస్తారు. శవాన్ని విద్యుత్ దహన యంత్రంలో దహనం చేస్తారు. శవం నుంచి వచ్చే బూడిదను మాత్రం కుటుంబసభ్యులకు ఇస్తారు. అటు మృతుడి కుటుంబసభ్యులపై కొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది.
అంత్యక్రియల్లో ఐదుగురికే అనుమతి, శవాన్ని తాకకూడదు:
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు సంబంధించి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని దహనం(cremation) మాత్రమే చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పూడ్చి పెట్టడానికి(burial) అనుమతి ఇచ్చేది లేదన్నారు. అంతేకాదు.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆ వ్యక్తి కుటుంబం నుంచి కేవలం 5మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. అంతేకాదు అంత్యక్రియల్లో మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదన్నారు. శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో సీల్ చేసి ఇస్తామన్నారు. ఒకవేళ శవాన్ని పూడ్చి పెట్టాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తే, ముంబై నగరానికి దూరంగా అంత్యక్రియలు చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తామన్నారు. కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిబంధనలు విధించామని అధికారులు వివరించారు. కాగా, మన దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 200మందికిపైగా కరోనా బారిన పడ్డారు. పలువురు చనిపోయారు. దీంతో అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* 200 దేశాలకు పాకిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 7లక్షల 85వేల 777 కేసులు, 37వేల 815 మరణాలు
* యూరప్ ఖండంలోనే దాదాపు 27వేల మందిని బలి తీసుకున్న కరోనా
* ఇటలీలో ఒక్క రోజే 812 మంది, స్పెయిన్ లో 537 మంది మృతి
* అమెరికాలో ఒక్క రోజే దాదాపు 20వేల కరోనా కేసులు
* అమెరికాలో నిన్న ఒక్క రోజే 568 కరోనా మరణాలు
* అమెరికాలో లక్ష 64వేల 253 కేసులు, 3వేల 165 మరణాలు
* ఇటలీలో 1,01,739 కరోనా కేసులు.. 11,591 కరోనా మరణాలు
* చైనాలో 81వేల 518 కేసులు, 3వేల 305 మరణాలు
* స్పెయిన్ లో 87వేల 956 కేసులు, 7వేల 716 మరణాలు
* జర్మనీలో 66వేల 885 కేసులు, 645 మరణాలు
* ఇరాన్ లో 41వేల 495 కేసులు, 2వేల 757 మరణాలు
* బ్రిటన్ లో 22వేల 141 కరోనా కేసులు, 1,408 మరణాలు
* ఫ్రాన్స్ లో 44వేల 550 కేసులు, 3వేల 24 మరణాలు
* * ఫ్రాన్స్ లో ఒక్క రోజే 418 మంది, బ్రిటన్ లో 180 మంది, ఇరాన్ లో 117 మంది, నెదర్లాండ్స్ లో 93 మంది, బెల్జియంలో 82 మంది మరణం
* భారత్ లో 1251 కరోనా కేసులు, 33 మరణాలు
* నిన్న ఒక్క రోజే భారత్ లో 227 మందికి పాజిటివ్
* మహారాష్ట్రలో 255 మందికి పాజిటివ్
* కేరళలో 222 కేసులు, రెండు మరణాలు
* ఢిల్లీలో 97 కేసులు, రెండు మరణాలు
* కర్నాటకలో 83 కేసులు, మూడు మరణాలు
* గుజరాత్ లో 70 కేసులు, ఆరు మరణాలు
* తమిళనాడు 74 కేసులు, ఒకరు మృతి..74 బాధితుల్లో 16మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారే
* తెలంగాణలో 76 కేసులు, 6 మరణాలు
* ఏపీలో 40 కరోనా కేసులు
* భారత్ లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 102
* దేశంలో పాజిటివ్ కేసుల్లో 80శాతం నిజాముద్దీన్ ఘటనతోనే