‘రామనామం’ఇటుకలు : రామ మందిరానికి ఇటుకల బట్టీ యజమాని విరాళం

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 05:24 AM IST
‘రామనామం’ఇటుకలు : రామ మందిరానికి ఇటుకల బట్టీ యజమాని విరాళం

Updated On : November 23, 2019 / 5:24 AM IST

రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో మార్గం సుగమమం అయ్యింది. దీంతో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు..ట్రస్ట్ లు భారీ విరాళాలను ప్రకటించాయి.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని తక్పురాకు చెందిన బీకే ఇటుకల బట్టీ యజమాని మాలికా సందీప్ వర్మ  రామ మందిర నిర్మాణానికి తనవంతుగా 51 వేల ఇటుకల్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. అలా ఇస్తున్న ఇటుకలపై ఓ శ్రీరామ్ అని రాముడి పేరును కూడా పొందుపరిచారు. 

రామాలయంలోని గర్భాలయంలో నిర్మాణ పనులకు 51 వేల ఇటుకలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇటుకలన్నింటిపై రామనామం రాసి ఉంటుంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రాగానే తాను ఇటుకలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ ఇటుకలన్నింటిపైనా రామనామం రాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇటుకలను ఎంతో శ్రద్ధగా..భక్తితో తయారు చేయిస్తున్నామని తెలిపారు.

మొత్తం 18 బట్టీలలో ఇటుకలు తయారవుతున్నాయని, ఇప్పటికే 4 వేల ఇటుకలు సిద్ధమయ్యాయన్నారు. మిగిలినవి తయారవుతున్నాయని సందీప్ వర్మ తెలిపారు. ఈ ఇటుకల తయారీకి ప్రత్యేకమైన మట్టిని వాడుతున్నామనీ..ఇటుకల తయారీకి 16మంది కూలీలు రాత్రి పగలు కష్టపడి ఎంతో భక్తిశ్రద్ధలతో పనిచేస్తున్నారని తెలిపారు.