Amethi : పెళ్లి కొడుకు కోరిక, చితకబాదిన గ్రామస్తులు

తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్‌కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు.

Amethi : పెళ్లి కొడుకు కోరిక, చితకబాదిన గ్రామస్తులు

Up

Updated On : May 22, 2021 / 2:13 PM IST

Bridegroom Was Beaten : తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్‌కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు. చివరకు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అమేథీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమేథీ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటోంది.

మొహమ్మద్ అమీర్ కుమారుడు ఇమ్రాన్ సాజ్ తో నాసిమ్ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. వివాహం జరిగిన అనంతరం విందులో వరుడు మనస్సులో ఉన్న కోరికను వెలిబుచ్చాడు. వరకట్నం కింద తనకు ఇచ్చిన బైక్ వద్దని, బుల్లెట్ వాహనం ఇవ్వాలని పట్టుబట్టాడు. అంత స్థోమత తనకు లేదని, త్వరలోనే బుల్లెట్, కారు ఇస్తానని వధువు తండ్రి చెప్పాడు.

ఎంత బతిమిలాడినా అతను వినిపించుకోలేదు. ఆగ్రహించిన గ్రామస్థులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకుని తండ్రి, వరుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More : Officer Suicide: కార్యాలయంలో వ్యవసాయశాఖ ఉద్యోగిని ఆత్మహత్య