Dowry : వింత ఆచారం.. అల్లుడికి కట్నంగా 21 పాములు
వరకట్నం తీసుకోవడం చట్టప్రకారం నేరం.. చట్టమైతే చేశారు కానీ అమలు కావడం లేదు.. వరకట్నం లేకుండా పెళ్లి జరగడం లేదనడం సత్యం. ఎంతోకొంత వరకట్నం తీసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు.

Dowry
Dowry : వరకట్నం తీసుకోవడం చట్టప్రకారం నేరం.. చట్టమైతే చేశారు కానీ అమలు కావడం లేదు.. వరకట్నం లేకుండా పెళ్లి జరగడం లేదనడం సత్యం. ఎంతోకొంత వరకట్నం తీసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు. ధనవంతులు కోట్లలో కట్నాలు ఇస్తుంటే.. పేదవారు తమ శక్తిని బట్టి అల్లుడికి వరకట్నం సమర్పించుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో ఇస్తే మరికొందరు బంగారం పొలాల రూపంలో కట్నం ముట్టచెబుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే దేశంలోని ఓ తెగవారు వరకట్నంగా 21 పాములు ఇస్తారట.. మధ్యప్రదేశ్‌లోని గౌరియా తెగవారు ఈ వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా అనుసరిస్తున్నారు. పాములు పట్టి జీవనం సాగించే ఈ తెగవారు తమ కూతురుని చేసుకోబోయే వ్యక్తికి వరకట్నంగా 21 విషసర్పాలు ఇస్తారట.. ఈ తెగవారు పాములను నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. పట్టణాల్లో పాములు ఆడిస్తూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఇక వరుడికి ఇచ్చిన పాములతో అతడు తన కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉంటుంది.
చదవండి : No Dowry Affidavit : కట్నం తీసుకోలేదని ఉద్యోగులంతా అఫిడవిట్ ఇవ్వండి, ప్రభుత్వం కీలక ఆదేశం
అంతే కాకుండా తనకు ఇచ్చిన పాములను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వరుడిపైనే ఉంటుంది. పాము బుట్టలో మరణిస్తే అది అశుభంగా భావిస్తారు.. కుటుంబ సభ్యులు గుండు చేయించుకొని క్రతువులు నిర్వహిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో ఇలాంటి వింతలు, విశేషాలకు కొదవ లేదని చెప్పాలి.