Pune Bridge Collapsed: కుప్పకూలిన బ్రిడ్జి.. ఆరుగురు దుర్మరణం.. కొట్టుకుపోయిన టూరిస్టులు..

కుండమల ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. వర్షాకాలంలో టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

Pune Bridge Collapsed: కుప్పకూలిన బ్రిడ్జి.. ఆరుగురు దుర్మరణం.. కొట్టుకుపోయిన టూరిస్టులు..

Updated On : June 15, 2025 / 7:04 PM IST

Pune Bridge Collapsed: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. కుండమల ప్రాంతంలోని ఇంద్రయాణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. 20మంది టూరిస్టులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. బ్రిడ్జి పాతది కావడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుండమల ప్రసిద్ధ పర్యాటక
కేంద్రం. వర్షాకాలంలో టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

వీకెండ్ కావడంతో ఈ టూరిస్ట్ స్పాట్ కి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. వంతెనపైకి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వచ్చారు. దాంతో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇంద్రయాణి నదిపై నిర్మించిన ఈ వంతెన దశాబ్ద కాలం నాటిది. ఆదివారం కావడంతో పర్యాటకులు కుండమలకు పోటెత్తారు. ప్రకృతి అందాలు చూసి పులకించిపోవాలని అనుకున్నారు.

కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చారు. ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. కానీ, అక్కడ ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. విహారయాత్రం విషాదాన్ని నింపింది. వంతెన కూలి టూరిస్టులు చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది పర్యాటకులు ఇంకా ప్రమాద జరిగిన స్థలంలోనే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో, వీకెండ్స్ లో ఈ ప్రాంతానికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అసలే పాత వంతెన కావడం, భారీ వర్షాలకు తడిచిపోవడం, వంతెన పైకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం.. ఈ కారణాలతో బ్రిడ్జి కూలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గత రెండు రోజులుగా కుండమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం కూడా పెరిగింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా పర్యాటకుల భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నీటి ప్రవాహం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం 15 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!