రాజకీయ విబేధాలు మరిచి…హాస్పిటల్ లో సిద్దూని పరామర్శించిన యడియూరప్ప

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 04:42 PM IST
రాజకీయ విబేధాలు మరిచి…హాస్పిటల్ లో సిద్దూని పరామర్శించిన యడియూరప్ప

Updated On : December 12, 2019 / 4:42 PM IST

రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి యడియూరప్ప అడిగి తెలుసుకున్నారు.సిద్దూ త్వరగా కోలుకోవాలని యడియూర్ప అన్నారు. యడియూరప్ప సిద్దూని పరామర్శించిన సమయంలో బీజేపీ నాయకులు,సిద్దరామయ్య మధ్య హాస్య సంబాషణ జరిగింది. సిద్దూ,యడియూర్పప్ప,బీజేపీ నాయకులు కాసేపు సరదాగా నవ్వుకున్నారు.

కొంతకాలంగా యడియూరప్ప సర్కర్ పై సిద్దరామయ్య విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే విబేధాలు రాజకీయాల్లోనే ఉంటాయి,రాజకీయ వేబేధాలు వ్యక్తిగత స్నేహంలోకి రావని తాను నమ్మేవాడినని ముఖ్యమంత్రి తనని పరామర్శించిన అనంతరం సిద్దూ ట్వీట్ చేశారు.

సిద్ధరామయ్య (71) ఛాతీ నొప్పితో నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు సిద్ధరామయ్య గుండెకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,మరో రెండు రోజులు తాను హాస్పిటల్ లో రెస్ట్ తీసుకుంటానని సిద్దూ ట్వీట్ చేశారు.