బడ్జెట్ 2019 : రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు

బడ్జెట్ 2019లో రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పియూష్ గోయల్ ప్రకటించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ అమలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు నిరుపమానమని తెలిపారు.
సైనికుల వల్లే దేశంలోని ప్రజలు భద్రంగా ఉన్నారన్నారు. వారి త్యాగాలకు విలువ ఇవ్వలేం అని.. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు మంత్రి. త్వరలోనే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు. దీని ద్వారా భారత రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు మంత్రి.