బడ్జెట్ 2020 : రైతుల కోసం ప్రత్యేకంగా రైలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 1, 2020 / 07:10 AM IST
బడ్జెట్ 2020 : రైతుల కోసం ప్రత్యేకంగా రైలు

Updated On : February 1, 2020 / 7:10 AM IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయాన్ని పెంచడానికి తీసుకురాబోతున్న 16యాక్షన్ ప్లాన్స్ లో ఇది ఒక భాగం.

పెరిషబుల్ గూడ్స్(పాడైపోయే వస్తువులు..పాలు,మొదలైనవి)ని సంరక్షించడానికి మరియు వాటి వేగవంతమైన రవాణా కోసం ఈ ప్రత్యేక కిసాన్ రైలును ఉపయోగిస్తారు. పాలు,పెరుగు వంటి పాడైపోయే వస్తువుల రవాణా కోసం  పీపీపీ(పబ్లిక్-ప్రేవేట్ పార్టనర్ షిప్)పద్దతిలో ప్రభుత్వం ఈ రైలుని ప్రభుత్వం నడిపిస్తుంది. రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పోటీగా మార్చాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సీతారామన్ నొక్కిచెప్పారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత, గ్రామీణాభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయని ఆమె చెప్పారు. 

మొదటి ప్రాధాన్యాశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, రెండోది ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, మూడోది విద్య, చిన్నారుల సంక్షేమం, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై తాము దృష్టి సారించామన్నారు.  కేంద్రప్రభుత్వం పాస్ చేసిన మోడల్ అగ్రికల్చరల్ చట్టాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను తాము ప్రోత్పహించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 15 లక్షల మంది రైతులు వారి గ్రిడ్-కనెక్ట్ చేసిన పంపుసెట్లను సోలరైజ్ చేయడానికి కేంద్రం సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఇవమ్ ఉద్దాన్ మహాభియాన్(PM KUSUM)ను విస్తరిస్తామని,దీంతో 20లక్షలమంది రైతులకుస్వతంత్ర సోలార్ పంపుల ఏర్పాటులో సాయం అందిస్తామని తెలిపారు. సాగులేని భూముల్లో సోలార్ కేంద్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందన్నారు.

అంతేకాకుండా అత్యాధునికమైన తేజస్ వంటి రైళ్లు మరిన్ని పట్టాలెక్కనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 27వేల కిలీమీటర్ల రైల్వే ట్రాక్ లను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని ఫ్లాన్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రైల్వే ట్రాక్ ల పక్కనే రైల్వేలకు చెందిన భూమిలో పెద్ద సోలార్ పవర్డ్ కెపాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2021 ఆర్థికసంవత్సరం నుంచి రైల్వేస్ తమ ప్రొడక్షన్ ను కార్పొరేటీకరణ చేసయడం ప్రారంభిస్తాయని నిర్మలా తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నవి కాకుండా మరో 100 ఎయిర్ పోర్ట్ లను అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు.